మరిపెడ, అక్టోబరు 30: దేశానికి పట్టుగొమ్మలైన పల్లెసీమలను అన్నివిధాలా అభివృద్ధి చేస్తూ గ్రామీణుల ఆర్థికస్థితిగతులు మార్చిన సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం మున్సిపల్ కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు రూ.లక్షా 116 చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లికి సీఎం కేసీఆర్ తనవంతుగా సాయం అందిస్తున్నాని తెలిపారు. మరిపెడ మండలంలో 45 మంది లబ్ధిదారులకు రూ.45,05,220 విలువైన చెక్కులు అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్న విషయాన్ని రెడ్యానాయక్ వివరించారు. రైతులకు పంటల పెట్టుబడి కోసం ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నారని, రైతుబీమా పథకంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందజేస్తున్నారని ఆయన చెపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు, స్టాండింగ్ కమిటీ చైర్మన్, జడ్పీటీసీ తేజవత్ శారద, డీసీసీబీ డైరెక్టర్ చాపల యాదగిరి రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ సింధూర కుమారి, తహసీల్దార్ రమేశ్‌బాబు, మైనార్టీ సెల్ నాయకులు ఎండీ అయూబ్ పాషా, కౌన్సిలర్లు బానోత్ శ్రీను, రేఖ లలిత, మాచర్ల స్రవంతి, పానుగోతు సూజాత, బోడ పద్మ, వూరుగొండ శ్రీను, విసారపు ప్రగతి, హతిరాం, ఎడెల్లి పరశురాములు, బయ్య భిక్షం, కోఅప్షన్ సభ్యులు ఉప్పల నాగేశ్వరరావు, దేవరశెట్టి శ్రీలత, షేక్ మక్సూద్ పాల్గొన్నారు.
దేశ రాజకీయాలపై ‘విజయగర్జన’ ప్రభావం
నవంబరు 15న ఓరుగల్లులో నిర్వహించనున్న టీఆర్ఎస్ విజయగర్జన సభ దేశ రాజకీయాలపై ప్రభావం చూపుతుందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపారు. ఈ సభకు వేలాదిగా తరలిరావాలని పార్టీ శ్రేణులను ఆయన కోరారు. విపక్ష పార్టీల ఆరోపణలను ఖండించాలన్నారు.
మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలి
మరిపెడను వ్యాపార, వాణిజ్య కేం ద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తున్నట్లు డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ సింధూరకుమారి అధ్యక్షతన శనివారం మున్సిపల్ పాలకమండలి, అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. రెడ్యానాయక్ మాట్లాడు తూ సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మరిపెడను మున్సిపల్ కేంద్రంగా ఏర్పాటు చేశామ న్నారు. మంత్రి కేటీఆర్ తోడ్పాటుతో రూ.20 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు .రూ.85 లక్షలతో ఉద్యానవనం, రూ.2 కోట్లతో మోడల్ మార్కెట్, రూ.1.20 లక్షలతో ఇండోర్ స్టేడియం, రూ.31 లక్షలతో ఎస్సీ కమ్యూనిటి హాల్, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, కౌన్సిలర్లు బానోత్ శ్రీను, రేఖ లలిత, మాచర్ల స్రవంతి, పానుగోతు సుజాత, బోడ పద్మ, వూరుగొండ శ్రీను, విసారపు ప్రగతి, హతిరాం, ఎడెల్లి పరశురాములు, బయ్య బిక్షం, కోఅప్షన్ సభ్యులు ఉప్పల నాగేశ్వరరావు, దేవరశెట్టి శ్రీలత, షేక్ మక్సూద్, షేక్ ఖైరుణ్ హుస్సేన్ పాల్గొన్నారు.