రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శోభారాణి
తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు భరోసా
రెండు నెలలకు సరిపడా సరుకులు పంపిణీ
చిట్యాల, అక్టోబర్ 30 : తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన నలుగురు పిల్లలకు అండగా ఉంటామని రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు అనుమాండ్ల శోభారాణి అన్నారు. శనివారం ఆమె పాశిగడ్డతండా గ్రామానికి చేరుకుని నిరాశ్రాయులుగా మారిన గిరిజన చిన్నారులను ఓదార్చారు. వారిని అక్కున చేర్చుకుని భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. తక్షణ సాయం కింద రెండు నెలలకు సరిప డా నిత్యావసరాలు, అర్థికసాయం అందజేశారు. అనంతరం కొవిడ్‌తో తండ్రిని కోల్పోయిన అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు పిల్లలకు నిత్యావసర సరుకులు అందజేశారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్‌ను తనిఖీ చేసి పలు సూచనలను అందజేశారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ.. పిల్లలకు సంబంధించి పూర్తి బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని, వారి గురించి దిగులు చెందాల్సి అవసరం లేదని భరోసా కల్పించింది. ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ప్రత్యేక ఆర్థికసాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. చిన్నారులకు మెరుగైన విద్య అందించాడానికి ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తం డ్రిని, లేదా తల్లిని, తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయి న పిల్లలు ఎవరైనా ఉంటే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌కు 1098కు సమాచారం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ దా స్యం వేణుగోపాల్, జిల్లా సంక్షేమ అధికారి సామ్యూల్, బాలరక్ష భవన్ కోర్డినేటర్ శిరీష, డీసీపీవో హరికృష్ణ, సీడీపీవో అవంతి, బాలల సంరక్షణ అధికారి రాజకొమురయ్య, సహాయ గిరిజానిభివృద్ధి అధికారి దేశిరా మ్, తహసీల్దార్ రామారావు, స్థానిక సర్పంచ్ లావుడ్య రజిత, పంచాయతీ కార్యదర్శి రమ్య పాల్గొన్నారు.