బచ్చన్నపేట, అక్టోబర్ 28 : మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి పనులు వెంటనే పూర్తి చేయాలని, అదే విధంగా ప్రతి ఊర్లో వందశాతం వ్యాక్సినేషన్ అయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని జడ్పీ సీఈవో విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె మండలంలోని నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించి శ్మశానవాటిక, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్డు పనులను పర్యవేక్షించారు. అదే విధంగా కరోనా వ్యాక్సిన్ పూర్తికి చేపట్టిన సర్వేను అమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలన్న ఆశయంతో ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి పనులు వందశాతం పూర్తి కావాలన్నారు. పెండింగ్ పనులుంటే ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు. అంతే కాకుండా నవంబర్ 3 వరకు ప్రతి గ్రామంలో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ వేసుకునే విధంగా కృషి చేయాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో రఘురామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి దేవిప్రసాద్, కారోబార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలి
మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని ఎంపీడీవో రఘురామకృష్ణ సూచించారు. గురువారం ఆయన మండలంలోని పలు గ్రామాలను పర్యటించి, సర్వేను పరిశీలించారు. గ్రామ నోడల్ అధికారి సహా డిసిప్ల్లినరీ టీం ప్రతి ఇళ్లు తిరిగి టీకా వేసుకున్నారా? లేదా? ఎందుకు వేసుకోలేదు, ఎన్ని డోసులు వేసుకున్నారు అనే తదితర పూర్తి వివరాలను సేకరించాలన్నారు. అనంతరం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి తిరిగి వారికి టీకా వేయాలన్నారు. అన్ని గ్రామాల్లో నూరుశాతం వ్యాక్సిన్ పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆయా గ్రామాల సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉద్యమంగా సాగుతున్న కొవిడ్ వాక్సినేషన్..
పాలకుర్తి: ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకాలు వేసుకునేందుకు పాలకుర్తితో పాటు మండలవ్యాప్తంగా గురువారం ఉద్య మం గా కొవిడ్ టీకాలు నిర్వహించారు. మండల కేంద్రంలో తహసీల్దార్, నోడల్ అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశకార్య కర్తలు, అంగన్వాడీ టీచర్లు, రేషన్ డీలర్లు సమన్వ యంతో కలిసి ఇప్పటి వరకు టీకాలు తీసుకోనివారిని గుర్తిం చారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి టీకాలు తీసుకోని వారికి కొవిడ్‌పై ఆవగాహన కల్పించి టీకాలు వేసుకునేలా చొరవ తీసుకున్నారు. వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పక్రి యను పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
కొడకండ్ల: మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక బృం దాల ద్వారా ఇంటింటికీ వ్యాక్సినేషన్ అందేలా ఏర్పాట్లు చేసి నట్లు ఎంపీడీవో రమేశ్ తెలిపారు. గురువారం మండలం లోని రామన్నగూడెంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండ లంలో వంద శాతం వ్యాక్సినేషన్‌కు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా పాకాల గ్రామంలో నర్సరీ, వ్యాక్సి నేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. హక్యతండా, బోడోని కుంట తండాల్లో పర్యటించారు.