వీల్‌చైర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి టోర్నమెంట్
రెండు రోజుల పాటు నిర్వహణ
పాల్గొన్న తెలంగాణ, ఏపీ, రాజస్థాన్ జట్లు
వైకల్యం క్రీడలకు అడ్డుకాదు: చీఫ్ విప్
హనుమకొండ, డిసెంబర్ 27: వీల్ చైర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి దివ్యాంగుల క్రికెట్ టోర్న మెంట్‌ను సోమవారం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ క్రికెట్ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల టీంలు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడగా, తెలంగాణ టీం గెలిచింది. అలాగే ఆంధ్ర, రాజస్థాన్‌కు జరి గిన పోటీలో ఫలితం వెల్లడి కాలేదు. ప్రతి టీం కు ట్రోఫీతో పాటు గెలుపొందిన జట్టుకు ప్రైజ్మ నీ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ వారికి కిట్లను సమకూ ర్చిన మంత్రి కేటీఆర్‌కు చీఫ్ విప్ ఈ సందర్భం గా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వినయ్ భాస్కర్ అంగ వైకల్యం అనేది క్రీడలకు అడ్డు కా దన్నారు. దివ్యాంగ క్రీడాకారులకు అన్ని విధా లుగా సహకారం అందించనున్నట్లు పేర్కొన్నా రు. తెలంగాణ చరిత్రలోనే ఇలాంటి క్రీడలు వరంగల్ నగరంలో నిర్వహించడం మొట్టమొద టి సారన్నారు. దివ్యాంగులతో క్రికెట్ ఆడడం చాలా ఆనందంగా ఉందన్నారు. క్రీడలకు కేంద్ర బిందువైన హనుమకొండలో దివ్యాంగుల టోర్న మెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు.