మళ్లీ టెండర్లు పిలిచి పునఃప్రారంభించండి
అధికారులను ఆదేశించిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య
పీహెచ్సీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశం
కాళేశ్వరం, ఆగస్టు 23 : కాళేశ్వరం ఆలయంలో ఇప్పటి వరకు పూర్తికాని రెండు పనులను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రకటించారు. సోమవారం కాళేశ్వరంలోని వేములవాడ గెస్ట్‌హౌస్‌లో పల్లెప్రగతి, కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆలయంలో పూర్తికాని రెండు పనులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, మళ్లీ టెండర్లు పిలిచి పనులు పునఃప్రారంభించాలని అధికారులను ఆదేశించా రు. నాలుగు మండలాల్లోని పీహెచ్‌సీల్లో సెల్ కౌం టర్, ల్యాబ్‌లు, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా యా అని డాక్టర్ రామారావును అడిగారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుతో మాట్లాడుతూ తాగునీటి వసతిని మెరుగుపర్చాలని సూచించారు. పలిమెల మండలంలోని పలు సమస్యలను పీఆర్ ఏఈ రాజేందర్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కాళేశ్వరంలోని సర్వే నంబర్ 129, 142లో చేపట్టాల్సిన పనులను చేపట్టాలని తహసీల్దార్‌ను ఆదేశించా రు. మహదేవపూర్‌లో కొత్తగా ఇంటి నంబర్లు ఇవ్వవద్దని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్, జడ్పీ సీఈవో శోభారాణి, డీఎంహెచ్‌వో శ్రీరామ్, ఈవో మారు తి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శంకర్, ఎంపీపీ రాణిబాయి, జడ్పీటీసీ అరుణ, ఎంపీటీసీ మమత, సర్పంచ్ వసంత, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
విధుల్లో అలసత్వం వద్దు : కలెక్టర్
కాటారం : భూ రికార్డులు పక్కాగా ఆన్లైన్లో నమోదు చేయాలని, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ కృష్ణ ఆదిత్య హెచ్చరించారు. కాటారం తహసీల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు భద్రపరిచిన గదిని పరిశీలించారు. రికార్డులు క్రమపద్ధతిలో లేకపోవడంతో వెంటనే వాటిని సరిచేయాలన్నారు. అన్ని రికార్డులను కంప్యూటరైజేషన్ చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల హాజరు వివరాలను ఆన్లైన్లో ఎందుకు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్య క్తం చేశారు. అనుమతి లేకుండా సిబ్బంది గైర్హాజరైతే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారానికి కృషి ఏయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, డీటీ రామ్మోహన్, ఆర్ఐ భాస్కర్ పాల్గొన్నారు.
ట్రయల్ ఓపీ సేవలు ప్రారంభం
కాళేశ్వరంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీహెచ్సీలో ప్రస్తుతం ఓపీ సేవలను ట్రయల్‌గా ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. త్వరలోనే పీహెచ్‌సీని ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ముందుగా ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఈవో మారుతి ఆధ్వర్యంలో కలెక్టర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో పత్రి మొక్కను నాటారు. కాళేశ్వరంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో శ్రీరామ్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ కేంద్రంలో మౌలిక వసతులు కల్పించి ప్రారంభోత్సవానికి ఏ ర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. సెల్ సెంటర్(రక్త కణాల పరీక్ష కేంద్రం) ఏర్పాటు చేయాలని తెలిపారు. పీహెచ్సీ ఆవరణలో సమీక్ష నిర్వహించేందుకు 100 మంది కూర్చునేలా రేకుల షెడ్‌ను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.