ఈ నెల 31న ఖమ్మంలో క్రీడలు
ఆథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ వెల్లడి
జనగామ, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రస్థాయిలో జరిగే అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు జిల్లా నుంచి 12 మంది ఎంపికయ్యారు. శుక్రవారం జనగామ పట్టణం ధర్మకంచలోని మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10, 12, 14 సంవత్సరాల బాలబాలికలకు క్రీడా ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈనెల 31న ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో 7వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో క్రీడా ఎంపిక పోటీలపై అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకట నారాయణ గౌడ్ మాట్లాడారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు క్రీడా దుస్తులు సహా రవాణా చార్జీలు అందజేస్తామన్నారు. 10 సంవత్సరాల విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికైన వారిలో టీ సౌమ్య(100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్), ఎం లోహిత్కృష్ణ (లాంగ్‌జంప్, 100 మీటర్ల పరుగు), ఎం ఆదిత్య (100 మీటర్ల పరుగు), ఏ మైత్రేయ(300 మీటర్ల పరుగు), శ్రీశాంత్ (300 మీటర్ల, లాంగ్‌జంప్) ఎంపికయ్యారు. 12 సంవత్సరాల విభాగంలో పీ అర్చిత(100 మీటర్ల పరుగు, షార్ట్ఫుట్), ఎల్ రాము 400 మీటర్ల పరుగు, 600 మీటర్ల పరుగు), ఏ నిహారిక (100, 400 మీటర్ల పరుగు), సీహెచ్ హరిణి (లాంగ్‌జంప్, 300 మీటర్ల పరుగు, ఎల్ రమణ (100, 400 మీటర్ల పరుగు), శివానంద్ (600 మీటర్ల పరుగు) ఎంపికయ్యారు. 14 సంవత్సరాల విభాగంలో ఎం రామ్‌చరణ్(400 మీటర్ల) పరుగులో ఎంపికయ్యారని అసోసియేషన్ నిర్వహణ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి గుండ్ల కిష్టయ్య, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు చందుపట్ల రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మనోజ్‌కుమార్, కోశాధికారి ఆవుల అశోక్‌కుమార్, సహాయ కార్యదర్శి రంజిత్, సభ్యులు గజ్జల రాజు, ప్రవీణ్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు బండారి కిరణ్‌కుమార్, కూటికంటి శ్రీనివాస్, గజ్జెల్లి రాజు, మునిగె సురేశ్, హైమావతి, పవన్, కిషన్, సైదులు, లచ్చిరాం, వీర్యానాయక్ పాల్గొన్నారు.