గోవిందరావుపేట, ఆగస్టు22: తెలంగాణ రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే వారిని ప్రజలు తరిమి కొట్టాలని టీఆర్ఎస్ మండల సమన్వయ కర్త పోరిక గోవింద్‌నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు మురహరి భిక్షపతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా గోవింద్‌నాయక్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి దళితుల మన్ననలు పొందుతున్నారని అన్నారు. దళితుల అభివృద్ధిని చూసి తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలు ఈ పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా విమర్శలు మాని దళిత బంధు పథకానికి మద్దతు పలకాలని ఆయన హితవు పలికారు. సమావేశంలో ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాస్, మండల అధికార ప్రతినిధి సురపనేని సాయిబాబు, సురేశ్, నర్సింహ, రవీందర్, మోహన్‌రాథోడ్, హేమాద్రి, మురళీ, చందూలాల్, రమేశ్, మోహన్, సుధాకర్, రాంబాబు, వెంకన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.