భూపాలపల్లి రూరల్/ ఏటూరునాగారం/ వెంకటాపురం(నూగూరు)/మహదేవపూర్, ఆగస్టు 20: భూపాలపల్లి పట్టణంలో శుక్రవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 77వ జయంతి నిర్వహించారు. భూపాలపల్లి గణేశ్‌చౌక్ వద్ద రాజీవ్‌గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. భూపాలపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, నాయకులు భువనగిరి ప్రశాంత్, లవన్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆపార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అయూబ్, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, నాయకులు పెద్దబోయిన నర్సింగారావు, గౌస్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురం(నూగూరు) మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రాజీవ్‌గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ చెరుకూరి సతీశ్, పార్టీ నాయకులు మోహన్‌రావు, సాంబశివరావు, ధనపనేని శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మహదేవపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మహదేవపూర్ జడ్పీటీసీ గుడాల అరుణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు అక్బర్‌ఖాన్, ఎంపీటీసీ సుధాకర్, నాయకులు పాల్గొన్నారు.