డోర్నకల్/దంతాలపల్లి, డిసెంబర్ 19: బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా డోర్నకల్‌లో సోమవారం నిర్వహించే చావుడప్పు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం డోర్నకల్, దంతాలపల్లిల్లో ఏర్పా టు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. వడ్లు కొనుగోలు చేయ కుండా రైతులను ఇబ్బందులు పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి చావు డప్పు కొట్టాలన్నారు. ప్రతి వార్డు నుంచి వంద మంది కార్యకర్తలు హాజరు కావాలన్నారు. డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నున్న రమణ, ఎంపీపీ ధరంసోత్ బాలునాయక్, జెడ్పీటీసీ సభ్యురాలు పొడిశెట్టి కమల రామనాథం, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కత్తెరసాల విద్యాసాగర్, పీఏసీఎస్ చైర్మన్ చేరెడ్డి భిక్షంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గొర్ల సత్తిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు అంగోత్ హరీశ్, వార్డు కౌన్సిలర్లు పోటు జనార్థన్, కాల సురేందర్ జైన్, బోరగల్ల శరత్‌బాబు, బసిక అశోక్, జర్పుల వీరన్న, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ అజిత్మియా, టీఆర్ఎస్ నాయకులు కొత్త వీరన్న, తేజావత్ రమేశ్‌నాయక్, కాల యశోధర్ జైన్, చేపూరి వెంకటేశ్వర్లు, కృష్ణ, ముద్దంప్రతాప్, పచ్చిపాల శ్రీనివాస్ పాల్గొన్నారు. దంతాలపల్లిలో రైతుబంధు సమితి మండల కోఅర్డినేటర్ వలాద్రి మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి నాయిని శ్రీనివాస్‌రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్మరాపు వేణు, యూత్ మండల అధ్యక్షుడు వీరబోయిన కీసోర్కుమార్, మహిళ మండల అధ్యక్షురాలు గిర్వా ణి, నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గోన్నారు.
బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి
కురవి: కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాలను తిప్పికొట్టాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ పిలుపునిచ్చారు. కురవిలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ సోమవారం కురవి మండల కేంద్రంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతు సంక్షేమానికి వ్యతిరేకంగా కేంద్రం అవలంబిస్తున్న తీరును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. ఉమ్మడి గ్రామపంచాయతీల్లో నిరసన తెలిపిన తర్వాత మండల కేంద్రంలో పెద్దఎత్తున చేపట్టే నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు, మరిపెడ ఆత్మచైర్మన్ తోట లాలయ్య, జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ రవి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షు డు సుధాకర్‌రెడ్డి, మాజీ ఆలయ చైర్మన్ రాజునాయక్, నాయకులు నూతక్కి నర్సింహారావు, మండ ల పార్టీ కార్యదర్శి సాంబశివరావు, బోజ్యానాయక్, గ్రామ అధ్యక్షుడు కొణతం విజయ్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
చిన్నగూడూరు: మండలంలోని పలువురికి ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పంపిణీ చేశారు. ఉగ్గంపల్లికి చెందిన జి.లక్ష్మణ్‌కు రూ.73వేలు, శివానికి కూ.37వేలు, తిరుమలరావ్కు రూ.60వేలు, పగిడిపల్లి శివారు బాబోజి తండాకు చెందిన నరేశ్‌కు రూ.2.50లక్షలు, గుండంరాజుపల్లికి చెందిన శ్రీకాంత్‌కు రూ.35వేలు, విస్సంపెల్లికి చెందిన లింగమ్మకు రూ.45వేలు, జయ్యారానికి చెందిన వెంకటరెడ్డికి రూ.1.25లక్షలు, శ్రీరామ్‌కు రూ.1లక్ష 28వేలు, హుస్సేన్‌బీకి రూ.60వేలు, మరిపెడ మండలం యల్లంపేట శివారు లక్ష్మాతండావాసి హరికి రూ. 93,500, డోర్నకల్ మండలం పెరుమాండ్లసంకీసకు చెందిన వెంకన్నకు రూ.80వేల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకులు వల్లూరి వెంకటరెడ్డి, సంకినేని మంగపతిరావ్, మూల మురళీధర్‌రెడ్డి, పిల్లి వీరన్న, దారాసింగ్, చెన్నయ్య, కొమిరెల్లి, ఆయూబ్‌పాషా, మంగ్యానాయక్, మంగీలాల్, మల్లేశ్, గంగన్న, రాము, మూసిన్, శ్రీను, ఐలయ్య, కాషయ్య, సురేష్, అంబరీష ఉన్నారు.