ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్వర్
ఘనంగా ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవం
ములుగు రూరల్, ఆగస్టు 19 : తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఫొటోగ్రాఫర్ల పాత్ర గొప్పదని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో రామప్ప ఫొటోగ్రాఫర్ల అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవానికి జడ్పీ చైర్మన్ జగదీశ్వర్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఎన్నో విలువైన జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండేది ఫొటోతోనే అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో వాస్తవ చిత్రాలను తీసి ఢిల్లీకి కనిపించేలా ఫొటోగ్రాఫర్లు ప్రత్యేక పాత్ర పోషించారన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్, మాజీ ఎంపీని ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు శాలువాలతో సన్మానించి, రామప్ప చిత్రపటాలను అందించారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్వో ప్రేమలత, సబ్ రిజిస్టార్ తస్లీమా, టీఆర్ఎస్ నాయకులు గోవింద్‌నాయక్, రమేశ్, రామాచారి, భిక్షపతి, మధుసూధన్‌రెడ్డి, అశోక్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లిలో..
కృష్ణకాలనీ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహం సెంటర్లో జిల్లా ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎండీ రఫీ, భూపాలపల్లి మండల అధ్యక్షుడు సతీశ్ లూయిస్ జాకస్ మాండే డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రవికుమార్, మహేందర్, శ్రీనివాస్, సదానందం, మల్లేశ్, వెంకటేశ్, ప్రసాద్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాలలో..
చిట్యాల : అంతర్జాతీయ పొటోగ్రఫీ దినోత్సవం సం దర్భంగా మండల ఫొటో, వీడియో గ్రాఫర్ల సంఘం ఆధ్వ ర్యంలో గురువారం మండలకేంద్రంలో వేడుకలు ఘనం గా నిర్వహించారు. అతిథిగా ఎస్సై వీరభద్రరావు హాజరై ఫొటోగ్రాఫర్ల జెండాను ఆవిష్కరించి వారి సేవలను కొనియాడారు. అనంతరం నిరుపేదలకు ఎస్సై దుప్పట్లను పం పిణీ చేశారు. కార్యక్రమంలో మండల ఫొటోగ్రాఫర్ల సం ఘం అధ్యక్షుడు చింతల రమేశ్, ప్రధాన కార్యదర్శి కట్కూ రి రమేశ్, మహేందర్‌గౌడ్, టేకు రవి, పుల్ల రవి, సరిగొమ్ముల రాజేందర్, లక్ష్మణ్, తిరుపతి, సునిల్ పాల్గొన్నారు.
రోగులకు పండ్ల పంపిణీ
మహదేవపూర్ : మండలకేంద్రంలోని దవాఖానలో ఫొటోగ్రాఫర్స్ డేను గురువారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ రాణీబాయి ముఖ్య అతిథిగా హాజరై దవాఖాన ఎదుట ఫొటో కెమెరా సృష్టికర్త డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మండల ఫొటో గ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు చిప్ప జయంత్‌తో కలి సి రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆ తర్వాత డాక్టర్ చంద్రశేఖర్‌తో ఎంపీపీ దవాఖానలో సమావేశమయ్యారు. అలాగే తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు రా ములు గౌడ్ ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీలో మహదేవపూర్‌కు చెందిన పంతకాని రాజు తీసిన ఫొటోలు ప్రథమ స్థానంలో నిలిచినట్లు జాగృతి జిల్లా అధికార ప్రతినిధి మహేశ్ తెలిపారు.