ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు
పలు చోట్ల పాపన్న జయంతి వేడుకలు
కాటారం, ఆగస్టు 18: ఆత్మగౌరవ పోరాటంలో తొలితరం విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు అన్నారు. మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న 371వ జయంతి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంపీడీవో హాజరై పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. గీత వృత్తి చేసుకొని జీవించే పాపన్న నవాబుల పాలనలో రజాకార్ల ఆగడాలపై ఎదురుతిరిగి గెరిల్లా సైన్యంతో ఒక్కో కోటను స్వాధీనం చేసుకున్నాడన్నారు. పాపన్న చరిత్రకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు బుర్ర లక్ష్మణ్‌గౌడ్, వేముల శ్రీశైలం, సుధాకర్ గౌడ్, తాటి బాపు గౌడ్, మారగోని సత్యం, పొట్ల సదన్, రామిళ్ల రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
సర్వాయి పాపన్నకు ఘన నివాళి
ములుగురూరల్: ములుగు మండలంలోని సర్వాపురం గ్రామంలో సర్వాయిపాపన్న మోకుదెబ్బ (గౌడ సంఘం) జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన భిక్షపతిగౌడ్ ఆధ్వర్యంలో పాపన్న జయంతి నిర్వహించారు. ఆయన సంఘ నాయకులతో కలిసి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు రాజు, సాంబయ్య, మహేందర్, సారంగపాణి, నారాయణ, తిరుపతి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలి
గోవిందరావుపేట: గీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్‌గౌడ్ కోరారు. పస్రా సమీపంలోని తాటి వనంలో పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులకు ప్రభుత్వం ద్విచక్రవాహనాలు ఇవ్వాలని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గౌడ కులస్తులను గీతకార్మికులకుగా గుర్తించి సభ్యత్వ కార్డులను అందించాలని కోరారు. కార్యక్రమంలో జక్కు మొగిలి, జక్కు రాజు, బొమ్మగాని రమేశ్, భిక్షపతిగౌడ్, మహేశ్, వేణు, జానీ తదితరులు పాల్గొన్నారు.
పాపన్నగౌడ్ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం
మంగపేట: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోరాట పటిమ స్ఫూర్తి దాయకమైనదని ఏజెన్సీ గౌడ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు కారుపోతుల నర్సయ్యగౌడ్ అన్నారు. మండల కేంద్రంలో సంఘం మండల అధ్యక్షుడు రావుల శ్రీనుగౌడ్ గుర్తింపు సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలువురు సీనియర్ నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణాగౌడ్, ఉపాధ్యక్షుడు రావుల సత్యం, జిల్లా యువజన అధ్యక్షుడు పూజారి రాజుగౌడ్, బండపల్లి రవి, కేశవులు, బొంబోతుల మురళి, మల్లికార్జున్, మానుపల్లి వేణు, చామకూరి కృష్ణ, భీముడు, కృష్ణ, యాక స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జయంతి వేడుకలు
చిట్యాల: చల్లగరిగె, నవాబుపేట, ఒడితల గ్రామాల్లో సర్వాయిపాపన్న జయంతి నిర్వహించారు. చల్లగరిగె గౌడ సంఘం అధ్యక్షుడు ఏరుకొండ తిరుపతి ఆధ్వర్యంలో గ్రామ ప్రధాన కూడలి వద్ద పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏరుకొండ రాజేందర్, గౌడ కులస్తులు మూల రమేశ్, బండి రవీందర్, దూడపాక నరేశ్, సరోత్తం పాల్గొన్నారు.
టేకుమట్ల మండల కేంద్రంలో
టేకుమట్ల: మండల కేంద్రంలో సర్వాయిపాపన్న జయంతి నిర్వహించారు. సర్వాయి పాపన్న మోకుదెబ్బ మండల అధ్యక్షుడు పెసర్ ప్రకాశ్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాన కూడలి వద్ద పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు మిఠాయి తినిపించుకున్నారు. కార్యక్రమంలో కొయ్యల చిరంజీవి, పెసరు విజ్నేశ్, పెరుమాండ్ల క్రాంతి, బొమ్మ వేణు, రాజు, రంజిత్, రఘుపతి పాల్గొన్నారు.