Drinking Water | డయాబెటిస్ ఉందా..? రోజూ తగినంత నీటిని తప్పకుండా తాగాల్సిందే.. ఎందుకంటే..?
డయాబెటిస్ తో బాధపడే వారు గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితం అవుతాయని వైద్యులు చెబుతున్నారు.
Drinking Water | డయాబెటిస్ తో బాధపడే వారు గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. నీటిలో క్యాలరీలు, కార్బొహైడ్రేట్స్ వంటివి ఉండవు. కానీ నీరు తాగడం వల్ల తగినంత హైడ్రేషన్ ఉండడం వల్ల శరీరం గ్లూకోజ్ ను మరింత సమర్థవంతంగా ప్రాసెస్ చేసుకుంటుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. నీరు తక్కువగా తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ సాంద్రత ఎక్కువగా కనిపిస్తుంది.
ఇన్సులిన్ నిరోధకతపై ప్రభావం..
డీహైడ్రేషన్ కారణంగా చక్కెర స్థాయిలు ఎక్కువగా కనిపిస్తాయి. జీవక్రియ నియంత్రణ మరింత కష్టంగా మారుతుంది. శరీరం హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల గ్లూకోజ్ పలుచగా మారుతుంది. మూత్రపిండాలు అదనపు చక్కెరలను సజావుగా బయటకు పంపిస్తాయి. ఒత్తిడి హార్మోన్లు అదుపులో ఉండడం వల్ల ఇన్సులిన్ నిరోధకత కూడా తగ్గుతుంది. నీరు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించనప్పటికీ గ్లూకోజ్ స్థాయిలను, ఇన్సులిన్ నిరోధకతను నీరు ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
తప్పుడు ఆకలి ఉండదు..
సాధారణంగా మనం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు ఆకలి ఎక్కువగా అవ్వడం లేదా తీపి తినాలనిపించడం వంటివి జరుగుతాయి. కొన్నిసార్లు దాహాన్ని శరీరం ఆకలిగా తప్పుగా అర్థం చేసుకుంటుంది. దీని వల్ల చిరుతిళ్లు తినాలనే కోరిక కలగడంతో పాటు భోజనం తరువాత రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. రోజంతా క్రమం తప్పకుండా నీటిని తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం వల్ల తప్పుడు ఆకలి సంకేతాలను తగ్గించవచ్చు, ఆకలి నియంత్రణలో ఉంటుంది. కనుక భోజనంతో పాటు భోజనం విరామ సమయంలో, వ్యాయామం చేసిన తరువాత క్రమం తప్పకుండా నీటిని తాగాలి. శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. దీంతో శరీరం మొత్తం జీవక్రియ మెరుగుపడుతుంది.
ఇవి కూడా అవసరమే..
నీరు తాగడంతో పాటు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, ఫైబర్, ప్రోటీన్ వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా చూసుకోవచ్చు. నీరు స్వయంగా చక్కెర స్థాయిలను తగ్గించకపోయినా తగినంత హైడ్రేషన్ శరీరం గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసే సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కనుక శరీరం ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉండేలా నీటిని తాగుతూ ఉండాలి. నీరు తాగడం వల్ల మొత్తం శరీర ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

