మునుగోడు, ఫిబ్రవరి 19 : ప్రతి రోజు సాయంత్రం 6 గంటల తర్వాతే వైన్ షాపుల పర్మిట్ రూమ్ల్లోకి అనుమతి ఇవ్వాలని, ఆ లోపు ఎట్టి పరిస్థితుల్లో పర్మిట్ రూమ్ల్లోకి అనుమతించ వద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నిర్వాహకులకు మరోమారు స్పష్టం చేశారు. గురువారం నియోజకవర్గ కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న వైన్ షాప్ వద్ద ఎమ్మెల్యే కాసేపు ఆగి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాయంత్రం 6 గంటల లోపు పర్మిట్ రూమ్ లో గాని చుట్టూ పరిసరాల ప్రాంతాల్లోనూ ఎవ్వరు కూడా మందు తాగొద్దని వైన్ షాప్ నిర్వాహకులకు మరోమారు గట్టిగా చెప్పారు. తాను సూచించిన విధంగా వైన్ షాపుల సమయ పాలన నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు.