జయంతి సభల్లో ప్రజాప్రతినిధులు,
గౌడ సంఘాల నాయకులు
జనగామ చౌరస్తా, ఆగస్టు 18 : బహుజనుల హక్కుల కోసం పోరాడిన సర్ధార్ సర్వాయి పాపన్న జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని జనగామ ఏసీపీ ఎస్ వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్న 371 జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ‘గోపా’ వ్యవస్థాపక అధ్యక్షుడు కన్న పరశురాములు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో సర్వాయి పాపన్న కాంస్య విగ్రహం ఏర్పాటుకు బహుజనులంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపా జిల్లా అధ్యక్షుడు మేకపోతుల అంజనేయులు, నాయకులు బైరగోని శ్రీనివాస్, కుర్రెంల యాదగిరి, మడిపల్లి ఐలయ్య, బాలరాజు, రాజా సంపత్, విజయ్‌కుమార్, రామకృష్ణ, రంగు రవి, మాచర్ల ప్రభాకర్, చంద్రమౌళి, బాలరాజు, ఉపేందర్, రమేశ్, రామనర్సయ్య, లక్ష్మణ్, సంపత్, కోతి ప్రవీణ్, బూరుగు శ్రీనివాస్ పాల్గొన్నారు.
జనగామ రూరల్‌లో..
జనగామ రూరల్ : మండలంలోని పెంబర్తి, ఎర్రగొల్లపహాడ్‌లో సర్వాయి పాపన్న జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరి గౌడ్ మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం సర్వాయి పాపన్న పోరాడారని వివరించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌లు అంబాల ఆంజనేయులుగౌడ్, వంగాల రేణుకాశంకర్ పాల్గొన్నారు.
దేవరుప్పులలో..
దేవరుప్పుల : ప్రజల హక్కుల కోసం పోరాడిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఎంపీపీ బస్వ సావిత్రి అన్నారు. మండలంలోని కడవెండిలో సర్వాయి పాపన్న విగ్రహానికి బుధవారం గౌడ సంఘం నాయకులు, సర్పంచ్ పోతిరెడ్డి బెత్లినారెడ్డితో కలిసి ఆమె నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధుసమితి గ్రామ కోఆర్డినేటర్ లీనారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాటిపల్లి మహేశ్, గౌడ సంఘం నాయకులు పెద్ది సత్యనారాయణ, పంతం యాదగిరి, పెద్ది ఐలయ్య, పెద్ది ఆండాళు, పెద్ది జయమ్మ, వార్డు సభ్యులు సులుగురి మహేశ్, షఫీ, లక్ష్మీనారాయణ, గుమ్మడవెల్లి సోమన్న, కత్తుల సుధాకర్, రాములు, దరగాని మైసారావు, ఉడుత రాజ్‌కుమార్, ధరగాని రాములు పాల్గొన్నారు.
బచ్చన్నపేటలో..
బచ్చన్నపేట : సర్వాయి పాపన్న ధైర్యసాహసాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని గౌడ సంఘం నాయకులు అన్నారు. మండలంలోని కొన్నె, సాల్వాపూర్ గ్రామా ల్లో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొన్నె సర్పంచ్ వేముల వెంకటేశ్‌గౌడ్, తిరుపతి గౌడ్, శంకరయ్య గౌడ్, హరిబాబు పాల్గొన్నారు.
లింగాలఘనపురంలో..
లింగాలఘనపురం : బహుజనుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న ఆశయాలు నెరవేర్చాలని గౌడ సంఘం నాయకులు కోరారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన పాపన్న జయంతి ఉత్సవాల్లో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్, దిశ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు దూసరి గణపతి, నాయకులు గుర్రం బాలరాజుగౌడ్, తీగల సిద్ధూగౌడ్, బూడిద నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు.
తరిగొప్పులలో..
తరిగొప్పుల : మండలంలోని అబ్దుల్‌నాగారంలో సర్వాయి పాపన్న చిత్రపటానికి గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నా యకులు మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలని కోరా రు. ఈ కార్యక్రమంలో మూల రాములు, తాళ్లపల్లి రాజేశ్వర్ గౌడ్, బైరగోని సురేశ్‌గౌడ్, మూల మహేశ్‌గౌడ్, నరేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పాలకుర్తిలో..
పాలకుర్తి రూరల్ : బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూల వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని పాపన్న విగ్రహానికి బుధవారం స్థానిక సర్పం చ్ వీరమనేని యాకాంతారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌కుమార్, గౌడ సంఘం నాయకులు కమ్మగాని నాగన్న, తాళ్లపల్లి ఉప్పలయ్య, తాళ్ల సోమనారాయణ, మండల అధ్యక్షుడు పొడిశెట్టి వెంకన్నతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. దర్దేపల్లి, వావిలాల గ్రామాల్లోనూ పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్మగాని రమేశ్, గిరగాని సమ్మయ్య, ముప్పిడి రాజు, పరమేశ్వర్, రాంచందర్, మహేశ్, బండి కొండయ్య, సుధగాని రాంమోహన్, గిరగాని నర్సయ్య, కారుపోతుల వేణు, గుండెవేని కుమార్, పులి శ్రీనివాస్, పులి ప్రభాకర్, బండి సోమయ్య, గూడ దామోదర్, మాటూరి యాకయ్య, కారుపోతుల వెంకటయ్య, గుణ మధు, గిరగాని కుమార్ పాల్గొన్నారు.
జఫర్‌గఢ్ : సర్వాయిపాపన్న జయంతి వేడుకలను మండలంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కూనురులోని పాపన్న విగ్రహానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ రడపాక సుదర్శన్, జడ్పీటీసీ ఇల్లందుల బేబి, వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య, సర్పంచ్ ఇల్లందుల కుమార్, ఉప సర్పంచ్ మంజుల, ఎంపీటీసీ సంధ్య పాల్గొన్నారు.
కొడకండ్లలో..
కొడకండ్ల : బహుజన వీరుడు సర్వాయి పాపన్న ఆశయాలకనుగుణంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి పొడిశెట్టి వెంకన్న, మండల అధ్యక్షుడు బొమ్మగాని విక్రం గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని ఏడునూతుల, కొడకండ్ల, రామవరం గ్రామాల్లో సర్వాయి పాపన్న జయంతిని నిర్వహించారు. మండల కేంద్రంలోనూ గౌడ జనహక్కుల పోరాటసమితి ఆధ్వర్యంలో నర్మెట శ్రీనివాస్ గౌడ్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ‘గోపా’ మండల అధ్యక్షుడు దేశగాని నాగరాజు గౌడ్, సొసైటీ అధ్యక్షుడు వెలికట్టే శ్రీనివాస్ గౌడ్, బొమ్మగాని వీరస్వామి గౌడ్, ఉపాధ్యక్షుడు సైదులు, ఆయా గ్రామాల ఉప సర్పంచ్‌లు ఎలికట్టే సోమన్న, కప్పల శ్రీనివాస్, గౌడ సంఘం నాయకులు దేశగాని సతీశ్, మామిడి మల్లయ్య, ముత్యం మధు పాల్గొన్నారు.
చిల్పూరులో..
చిలల్పూరు : మండలంలోని చిన్నపెండ్యాలలో సర్వా యి సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని గౌడ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి బొందయ్య నేతృత్వంలో సమావేశంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, ఎంపీటీసీ తాళ్లపల్లి ఉమ సమ్మయ్య, టీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇల్లందుల సుదర్శన్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ జనగామ కొమురయ్య, యాదగిరి, ప్రవీణ్, సంపత్, మాధవరెడ్డి, శ్యామ్, యాదగిరి, బుచ్చయ్య పాల్గొన్నారు.