వెంకటాపూర్/మంగపేట/ఏటూరునాగారం/ వెంకటాపురం (నూగూరు)/గోవిందరావుపేట, నవంబర్ 17: వెంకటాపూర్, నర్సాపూర్ వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని నర్సాపూర్, కేశవపూర్, పాపయ్యపల్లి, తిమ్మాపూర్ ఎక్స్‌రోడ్డు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ మాడుగుల రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ కాసర్ల కుమారస్వామి, సర్పంచ్ మెడబోయిన అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని అన్నారు. కార్యక్రమంలోఎంపీటీసీ పోశాల అనిత, సొసైటీ వైస్ చైర్మన్ ఆర్.విజేందర్, పాలకవర్గ సభ్యులు మందల వెంకటరమణారెడ్డి, ఎం.ఇంద్రారవి, ఏ. ఓదెలు, సొసైటీ సీఈవోలు దిలీప్, శంకరయ్య, సిబ్బంది పాల్గొన్నారు. మంగపేట రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో సంఘ చైర్మన్ తోట రమేశ్ అకినేపల్లి మల్లారం, చెరుపల్లి, కమలాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ‘ఏ’ గ్రేడ్ క్వింటాల్‌కు రూ.1960, కామన్‌కు రూ.1940 ధర కల్పించామన్నారు. కార్యక్రమంలో సహకార సంఘ డెరెక్టర్లు సిద్దంశెట్టి లక్ష్మణ్‌రావు, అచ్చ సత్యనారాయణ, అకినేపల్లిమల్లారం మాజీ సర్పంచ్ వత్సవాయి శ్రీధరవర్మ, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు శేషగిరిరావు, సీఈవో జగన్నాథరావు, రైతు బంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ పొన్నం అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏటూరునాగారం మండలంలోని ఎక్కెల గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ కూనూరు అశోక్ ప్రారంభించారు. కార్యక్రమంలో సీఈవో దుర్గం రంగారావు, రైతులు పాల్గొన్నారు. వెంకటాపురం (నూగూరు) మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంకటాపురం పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిట్టెం ఆదినారాయణ ప్రారంభించారు. పాలకమండలి సభ్యులు దంతెనపల్లి శ్రీనివాస్, పల్నాటి ప్రకాశ్, సొసైటీ సీఈవో సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. గోవిందరావుపేట మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో గోవిందరావుపేట, పస్రా గాంధీనగర్, కర్కపల్లి, దుంపిల్లగూడెం, చల్వాయి, మచ్చాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు పీఏసీఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి తెలిపారు. పీఏసీఎస్ డైరెక్టర్ పాల్గొన్నారు.