మౌలిక వసతుల పనులు పూర్తి చేయండి
కలెక్టర్ భవేశ్ మిశ్రా
గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు
భూపాలపల్లి రూరల్, నవంబర్ 17: గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చేపట్టిన మౌలిక వసతుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేమాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆ శాఖ ద్వారా చేపట్టిన వివిధ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని వాటిని సమర్థవంతంగా నిర్వహించి గిరిజనులకు లబ్ధి చేకూర్చాలని అన్నారు. జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు మోత్తం 12 ఉన్నాయని వాటిలో విద్యనభ్యసించే గిరిజన విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చాడాలని, అన్ని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని అన్నారు. సౌకర్యం కోసం మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. గిరిజన బాలికల విద్యాసంస్థల్లో సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ద్వారా చేపట్టిన రహదారులు, డబుల్బెడ్రూమ్ ఇండ్లు, హెల్త్‌సబ్ సెంటర్లు, అంగన్వాడీ భవనాలు తదితర 28 నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ ఏఈలు శ్రీనివాస్, తిరుపతి, అభిత్ పాల్గొన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయాలి
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేస్తూ జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి, మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. కొత్తగా జిల్లా మత్స్య శాఖ అధికారిగా నియమితులైన ఎన్ రాణా ప్రతాప్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.