ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య
28,680ధరఖాస్తుల స్వీకరణ
45,449.03 ఎకరాల మేర పోడు చేసిన గిరిజనులు
32,154.21 మేరా సాగు చేసిన గిరిజనేతరులు
ములుగు, నవంబర్17(నమస్తేతెలంగాణ) : అడవులు అణ్యాక్రాంతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోడు భూముల సమస్యల ను పరిష్కరించేందుకు స్వీకరించిన దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలిం చాలని ములుగు కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం సాయం త్రం వరకు జిల్లాలోని 9 మండలాల వ్యాప్తంగా 28,680 పోడు దరఖా స్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఇందులో 14,868 దరఖాస్తులు గిరిజనుల నుంచి రాగా 45,449.03 ఎకరాల విస్తీర్ణం, గిరిజనేతరుల నుంచి 13,812 దరఖాస్తులు ద్వారా 32,154.21 ఎకరాల విస్తీర్ణం భూమిని పోడు చేసినట్లు తెలిపారు. ములుగు మండలంలో 2,149 దరఖాస్తుల ద్వారా 5262 ఎకరాల విస్తీర్ణం వెంకటాపూర్లో 3,737 దరఖాస్తుల ద్వారా 9,111.04 ఎకరాలు, కన్నాయిగూడెంలో 1,573 దరఖాస్తుల ద్వారా 3,728.29 ఎకరాలు, ఏటూరునాగారంలో 5186 దరఖాస్తుల ద్వారా 23,188.33 ఎకరాలు, మంగపేటలో 3,848 దరఖాస్తుల ద్వారా 11,016.15, గోవిందరావుపేటలో 2,058 దరఖాస్తుల ద్వారా 5,080.24 ఎకరాలు, వాజేడులో 2,108 దరఖాస్తుల ద్వారా 5,195.07 ఎకరాలు, వెంకటాపురం(నూగూరు)లో 1,682 దరఖాస్తుల ద్వారా 3,959.05 ఎకరాలు, తాడ్వాయి మండలంలో అత్యధికంగా 6,339 దరఖాస్తుల ద్వారా 21,072.25 ఎకరాల విస్తీర్ణం పోడు భూమితో కలుపుకుని జిల్లాలో 28,680 దరఖాస్తులు రాగా 77,613.11 ఎకరాల పోడు భూమికి సంబంధించిన పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అటవీ హక్కుల కమిటీల ద్వారా పరిశీలించి అర్హులైన వారికి హక్కు పత్రాలను అందించనున్నట్లు తెలిపారు. కొత్తగా ఎవరైనా పోడు చేసినట్లయితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు. ఈ విషయాలను ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని సూచించారు.