డోర్నకల్ ఆగస్టు 13: నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎంపీడీవో వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని మన్నెగూ డెం జీపీలో నర్సరీ, మల్లయ్యకుంటతండా జీపీలో అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన మొక్కలకు ట్రీ గార్డ్లను ఏర్పాటు చేయాలన్నారు. వంద శాతం మొక్కలు బతికించాలన్నా రు. ట్యాంకర్ ద్వారా నీళ్లను అందించాలరు. సర్పంచ్ పూల్ సింగ్, కార్యదర్శి, ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
గూడూరు: మండలం కేంద్రం మీదుగా నర్పంపేట, మహబూబాబాద్ వైపు ఉన్న హైవేలో ఇరువైపులా జడ్పీ సీఈవో రమాదేవి శుక్రవారం మొ క్కలు నాటారు. మండలంలోని గూడూరు, బొద్దుగొండ గ్రామాల్లో సీఈవో మొక్కలు నాటి ట్రీ గా ర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. దామరవంచ గ్రామంలో ఏర్పాటు చేయనున్న మెగా పల్లె ప్రకృతి వనాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, సర్పంచ్‌లు ముక్కా లక్ష్మణ్‌రావు, నునావత్ రమేశ్, ఎంపీవో ప్రసాద్, కార్యదర్శి బీమా, ఏపీవో బన్సీలాల్ పాల్గొన్నారు.
మహబూబాబాద్ రూరల్ : మొక్కలు మానవ మనుగడకు దోహద పడతాయని సర్పంచ్ గుగులోత్ లక్ష్మి అన్నారు. శుక్రవారం రేగడితండా పం చాయతీలో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలను పరిశీలించారు. అనంతరం ఇంటింటికీ ఐదు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జీపీలో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. గ్రామంలో మొక్కలను నాటడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు. గ్రామ రైతు కో ఆర్డినేటర్ రామచంద్రు, వార్డ్డుమెంబర్లు పాల్గొన్నారు.