కాసం వెడ్డింగ్మాల్ను ప్రారంభించిన
ఎంపీ సంతోష్‌కుమార్, సినీనటి
వరంగల్ చౌరస్తా, ఆగస్టు 13 : వరంగల్ స్టేషన్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన కాసం పుల్లయ్య వెడ్డింగ్ మాల్‌ను రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, సినీతార కాజల్ అగర్వాల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరంగా గుర్తింపు కలిగిన వరంగల్‌లో వెడ్డింగ్ మాల్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సినీతార కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. వస్త్ర వ్యాపారంలో విశేష అనుభవం కలిగిన కాసం సంస్థ ఏర్పాటు చేసిన ఈ మాల్లో మహిళల మనస్సుకు హత్తుకునేవిధంగా పట్టు, ఫ్యాన్సీ చీరలు అందుబాటులో ఉన్నాయన్నారు. మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మొదటి కొనుగోలు చేపట్టారు. ఎంపీ సంతోష్‌కుమార్, సినీనటి కాజల్ అగర్వాల్ రాకతో వరంగల్ చౌరస్తా ప్రాంతమంతా టీఆర్ఎస్ శ్రేణులు, సినీ అభిమానులతో కిక్కిరిపోయింది. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, శంకర్‌నాయక్, కేప్టెన్ లక్ష్మీకాంతారావు, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ తదితరులు పాల్గొన్నారు.