నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట, ఆగస్టు 12 : సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలని నర్సంపే ట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అధికారులను కోరారు. ఇటీవల జిల్లా సంక్షేమ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన శారద గురువారం నర్సంపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్దిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి, సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో నర్సంపేట ప్రాజెక్టు పరిధిలో సీడీపీవోగా పనిచేసిన అనుభవంతో మరింతగా రాణించాలని శారదను కోరారు. కాగా, శారదను అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, కస్తూర్బా మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ చామర్తి ఉషారాణి, సీడీపీవో రాధిక, ఏసీడీపీవో విద్య, డీసీపీవో మహేందర్‌రెడ్డి, సఖీ అడ్మినిస్ట్రేటర్ శ్రీలత, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు గొర్రె రాధ, బత్తిని శిరీష, మండలాల నాయకులు రమాదేవి, సుగుణ, శ్రీదేవి, సాంబలక్ష్మి, భాగ్య, అరుణ, చంద్రకళ, విజయలక్ష్మి, మల్లికాంబ, విజ య, కవిత, వాణి, వెంకటలక్ష్మి, సునీత, విజయలలిత పాల్గొన్నారు.
ఇండేన్ గ్యాస్ సేవలు ప్రారంభం
ఖానాపురం : రాగంపేట శివారులో ఏర్పాటు చేసిన ఇండేన్ గ్రామీణ్ విత్రక్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ సెంటర్‌ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి కొత్త కనెక్షన్లు అందజేశారు. అలాగే, గోదాం ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, సర్పంచ్ భాషబోయిన అయిలయ్య, నర్సంపేట మార్కెట్ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, తుంగబంధం రైతు బంధు సమితి కన్వీనర్ వేజళ్ల కిషన్‌రావు, తహసీల్దార్ జూలూరి సుభాషిణి, నర్సంపేట ఐఎంఏ అధ్యక్షుడు లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, కామగోని శ్రీనివాస్, గుంటి కిషన్, మున్సిపల్ వైస్‌చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, శ్రీధర్, బీరం వెంకటేశ్వర్లు, దేవునూరి అంజయ్య, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
చెన్నారావుపేట : మండల కేంద్రానికి చెందిన ఆకుల సారయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బాధిత కుటుంబా న్ని ఎమ్మెల్యే పరామర్శించి, రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. ఆయన వెంట ఎంపీపీ బదావత్ విజేందర్, జడ్పీటీసీ బానోతు పత్తినాయక్, కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, పార్టీ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుండె మల్లయ్య, సొసైటీ చైర్మన్లు ముద్దసాని సత్యనారాయణరెడ్డి, మురహరి రవి, మాజీ జడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి పాల్గొన్నారు. కాగా, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, కార్యదర్శులు రూ.10వేలు, మృతుడి కుమారుడు అశోక్ మిత్రులు రూ.10 వేలు ఆర్థికసాయం అందజేశారు. కాగా, లింగగిరిలో ముదురుకోళ్ల చొక్కమ్మ ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబానికి దొడ్డా మోహన్‌రావు రూ.10వేలు, 50 కేజీల బియ్యం అందించారు. కార్యక్రమంలో ఇన్చార్జి రాకం సాంబన్న, ఎంపీటీసీ పర్కాల లక్ష్మీరాజన్న, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మెడబోయిన కుమార్ పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఎలక్ట్రీషియన్ ముద్దునూరి అశోక్ ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబానికి యు వనేత కంది కృష్ణచైతన్యరెడ్డి 1.5క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు. వార్డు సభ్యులు రాసమల్ల సతీశ్, బండి ఉపేందర్, నాయకులు కందకట్ల సాంబయ్య, అడుప అశోక్, రమేశ్, ఉప్పునూతుల రాజు, కుసుమ శ్రీను పాల్గొన్నారు.