జడ్పీ సీఈవో ప్రసూనారాణి
విద్యార్థులకు బహుమతుల అందజేత
ములుగురూరల్, ఆగస్టు 12 : విద్యార్థులు, యువత లక్ష్యాలను ఎంచుకుని చదువులో ముందుకు సాగాలని జడ్పీ సీఈవో ప్రసూనారాణి అన్నారు. స్వాతం త్య్ర భారత అమృతోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గురువారం బహుమతులు అందజేశారు. జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి బండారుపల్లి మోడల్ పాఠశాలకు చెందిన పీ కీర్తన, ద్వితీయ యూపీఎస్ పాత్రాపురానికి చెందిన తనున్య, ప్రోత్సాహక బహుమతి జడ్పీహెచ్ఎస్ వెంకటాపురానికి చెందిన అన్వితకు రాగా ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ సీఈవో బహుమతులు అందజేశారు. సీనియర్స్ విభాగంలో రాజుపేట జడ్పీహెచ్ఎస్కు చెందిన పవన్కార్తీక్కు ప్రథమ బహుమతి, రామన్నగూడెం జడ్పీహెచ్ఎస్కు చెందిన హరిణికి ద్వితీయ బహుమతి, కేజీబీవీ కన్నాయిగూడేనికి చెందిన మహాలక్ష్మికి ప్రోత్సాహక బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో డీసీవో కార్యాలయ క్యాలిటీ కో ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, సమన్వయకర్తలు డీసీఈబీ కార్యదర్శి విజయమ్మ, ఎంఈవో శ్రీనివాసులు, రమాదేవి, సాంబయ్య, రాజు, డీసీఈబీ సహాయ కార్యదర్శి యాసం విక్రమ్రాజ్, హెచ్ఎం రజిత తదితరులు పాల్గొన్నారు.