ప్రారంభించనున్న చీఫ్ విప్ దాస్యం, ఎంపీ బండా ప్రకాశ్
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 11: నేటి నుంచి జరుగనున్న 30వ దక్షిణ భారత జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు వరంగల్ ఆతి థ్యం ఇవ్వనుంది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు మూడురోజుల పా టు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడి యం(జేఎన్ఎస్)లోని హ్యాండ్‌బాల్ క్రీడా ప్రాంగ ణంలో ఖోఖో చాంపియన్‌షిప్ నిర్వహించనుంది. ఈ పోటీల్లో దక్షిణ భారతదేశం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు, 100 మంది టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొంటా రని, వారికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగ ల్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, కార్యదర్శి తోట శ్యాంప్రసాద్ తెలిపారు. మొత్తం 12 జట్లలో 6 పురుషులు, 6 మహిళల జట్లు పోటీల్లో పాల్గొం టాయని, మహిళలకు యూత్ హాస్టల్, పురుషుల కు స్టేడియం ప్రాంగణంలో, అఫీషియల్స్‌కు ప్రైవే టు హోటళ్లలో వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. 12వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, రాజ్య సభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్, హనుమ కొండ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, తది తర సంఘాల బాధ్యులు పాల్గొని పోటీలను ప్రా రంభిస్తారని వారు తెలిపారు.
క్రీడా దుస్తులు పంపిణీ
ఖోఖో పోటీల్లో పాల్గొనే తెలంగాణ మహిళా, పురుషుల జట్టుకు గురువారం హనుమకొండ జేఎన్ఎస్లో క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్యా దవ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ట్రాక్‌షూట్ అం దజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట్ల రామకృష్ణ, సంయుక్త కార్యదర్శులు ఎన్ కృష్ణమూర్తి, జీ సదానందం, హ్యాండ్‌బాల్ కోచ్ బొడ్డు విష్ణువర్ధన్ పాల్గొన్నారు.