సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ వేణుగోపాల్
మహాముత్తారం, నవంబర్10: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ శ్రీదాస్యం వేణుగోపాల్ అన్నారు. బుధవారం మండలంలోని దొబ్బల పహడ్ మోడల్ పాఠశాలలలో బాలల హక్కుల వారత్సోవాల్లో భాగంగా సీడీపీవో, బాల రక్ష భవాన్ జిల్లా కో ఆర్డినేటర్ శిరీష అధ్యక్షతన బాలల హక్కుల రక్షణపై అవగాహణ కల్పించారు. చైర్పర్సన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఇప్పటి నుంచే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, దాని సాధనకు కృషి చేయాలన్నారు. 18 ఏళ్లలోపు బాలలకు సమస్యలు ఉంటే చైల్డ్ లైన్ నంబర్1098కు గానీ, డయల్ 100కు గానీ సమాచారం అందించాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ నాగరాజు, లీగల్ కం ప్రొబేషన్ ఆఫీసర్ మోహినొద్దీన్, లింగారావు, కౌన్సలర్ స్వప్న, కవిత, చైల్డ్‌లైన్ టీం సభ్యులు విక్రమ్, ఆనంద్, అంగన్వాడీలు టీచర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
బాలల హక్కులపై అవగాహన
టేకుమట్ల: బాలల హక్కుల వారోత్సవాలను పురష్కరించుకుని స్థానిక ఉన్నత పాఠశాలలో బాలల పరిరక్షణ అధికారి రాజకొమురయ్య హాజరై బాలల హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రాధానోపాధ్యాయుడు ప్రవీణ్, సోషల్ వర్కర్ శైలజ, చైల్డ్ కౌన్సిలర్ రమ్య, తులసి పాల్గొన్నారు.
బాలల హక్కులు కాపాడాలి
గణపురం: బాలల హక్కులను కాపాడటం అందరి బాధ్యత అని బాలల సంరక్షణ అధికారి రాజకొమురయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వివిధ పోటీలు నిర్వహించారు. విద్యాలయం ఇన్చార్జి చంద్రకళ, సోషల్ వర్కర్ శైలజ, చైల్డ్‌లైన్ కౌన్సిలర్ రమ్యతులసి, టీంమెంబర్ సాయికుమార్, అంగన్వాడీ టీచర్స్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.