జనగామ, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : బాలల హక్కులపై విసృతంగా ప్రచారం చేయడంతో పాటు వారి హక్కులకు భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా అదనపు కలెక్టర్ బాస్కర్రావుతో కలిసి బుధవారం ఆయన కలెక్టరేట్లో వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. శివలింగయ్య మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. బడి ఈడు పిల్లలతో పనులు చేయించొద్దని, వారిని పాఠశాలకు పంపేలా తల్లిదండ్రులు చూడాలన్నారు. బాలకార్మికులు పనులు చేయిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. బాల్య వివాహాలు, వేధింపులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. బాలలకు ఆపద వస్తే బాలల నేస్తం1098 ఉందని, దానిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు మహిళా సంక్షేమాధికారి జయంతి, జిల్లా సంక్షేమ సమితి చైర్పర్సన్ ఉప్పలయ్య, సభ్యులు కవిత, సుజాత, బాలల హక్కుల సంరక్షణ అధికారి రవికాంత్, చైల్డ్లైవ్ కో ఆర్డినేటర్ ఇక్బాల్పాషా పాల్గొన్నారు.
అంగన్వాడీలకు స్మార్ట్ఫోన్ల పంపిణీ..
పోషన్ అబియాణ్లో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లోని అంగన్వాడీ టీచర్లకు పోషణ్ ట్రాకర్ యాప్ అమలు చేసేందుకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా జిల్లా కలెక్టర్ శివలింగయ్య వాటిని అంగన్వాడీ టీచర్లకు అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ టీచర్ బాధ్యతగా విధులు నిర్వర్తించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూవో జయంతి, అంగన్వాడీ టీచర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు కోమల్ల ఎల్లమ్మ పాల్గొన్నారు.