ఘనంగా పూజలు చేసిన భక్తులు
పలు కాలనీల్లో విగ్రహాల ప్రతిష్ఠ
పూజలందుకుంటున్న అమ్మవారు
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 9 (నమస్తేతెలంగాణ): దేవీ నవరాత్రి వేడుకల్లో భాగంగా భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న నవాహ్నిక చంఢీ క్రతువులో భాగంగా వంశీ స్వామి బృందం పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పూజ మూడో రోజుకు చేరుకున్నది. మూడో రోజు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సతీమణి వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి అమ్మవారికి కలశ విశ్వక్షోన(గణపతి) ఆరాధన, చంఢీయాగం, కుంకుమ పూజ, కుమారి పూజ, ప్రభాత ఆరాధన, స్థాపిత ఆరాధన, తీర్ద ప్రసాదాల గోష్టి అంగరంగ వైభవంగా నిర్వహించారు.
గాయత్రీ దేవిగా దుర్గామాత
కృష్ణకాలనీ : జిల్లా కేంద్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించారు. శనివారం మూడో రోజు సందర్భంగా కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా దర్శనమివ్వడంతో అర్చకులు గాయత్రీదేవికి అష్టోత్తర శతనామార్చనలతో కారల్మార్క్సకాలనీలోని శివాలయంలో కుదురుపాక విష్ణుశర్మ, కృష్ణకాలనీలో కుదురు పాక కృష్ణమచార్యులు, రెడ్డికాలనీలో సతీష్ సౌధాని శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా సుభాశ్‌కాలనీ, జవహర్‌నగర్ కాలనీ, శాంతినగర్, హనుమాన్‌నగర్, లక్ష్మీనగర్, ఎల్బీ నగర్, పైలట్కాలనీల్లో ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో గాయత్రీ దేవికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పానుగంటి హారిక శ్రీనివాస్, మాడ కమల లక్ష్మరెడ్డి, ఎడ్ల మౌనిక శ్రీనివాస్, టీఆర్ఎస్ భూపాలపల్లి అర్బన్ మాజీ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి పాల్గొన్నారు.
పలిమెలలో..
పలిమెల: మండలంలో దుర్గాదేవి శరన్నవాత్రి ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంతో పాటు పంకెన, సర్వాయిపేట గ్రామాల్లో దుర్గమాతల విగ్రహాలను ప్రతిష్టించారు. మూడో రోజు చంద్రఘంటా అవతారంలో అలంకరించారు.
దుర్గామాతకు పూజలు
ములుగురూరల్: జిల్లా కేంద్రంలోని రామాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గాయత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మేరకు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్‌యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.
అన్నపూర్ణ అవతారంతో దుర్గామాత
ఏటూరునాగారం : మండల కేంద్రంలోని దుర్గామాత అన్నపూర్ణదేవి అవతారంలో దర్శనమిచ్చింది. వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయ నిర్మాణ స్థలంలో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అర్చకులు రాధాకృష్ణ శర్మ, నాగేశ్వర్రావు శర్మ, సూర్యనారాయణ శర్మ అవతారాలపై వివరించారు. కార్యక్రమాల్లో నిర్వాహకులు ముక్కెర భిక్షపతి, ప్రసాద్, గంజి రమేశ్, పెండ్యాల ప్రభాకర్, సప్పిడి రాము, అలువాల శ్రీనువాస్ పాల్గొన్నారు.