మరిపెడ, అక్టోబర్7 : అక్ర మ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన పోలీసిం గ్ వ్యవస్థతో అక్రమ వ్యాపారులపై నిఘా కొనసాగిస్తునట్లు ఎస్పీ తెలిపారు. మరిపెడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి సుమారు రూ.5 లక్షల విలువ చేసే 26 ఎండు గంజాయి ప్యాకెట్లను స్వాధీ నం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి ఆకేరువాగు వద్ద ఎస్సై లావుడ్య నరేశ్‌నాయక్ గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామానికి చెందిన ధరంసోతు భద్రువద్ద 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా మరిపెడ ఎస్సై ప్రవీణ్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన తనిఖీల్లో సేవానగర్‌కు చెందిన బర్మావత్ శ్రీరాములు ఇంట్లో ఇండికా కారులో 40 కిలోల గంజాయిని ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రాములును అదుపులోకి తీసుకున్నట్లు కోటిరెడ్డి వివరించారు. అంతేకాకుండా గంజాయి తరలిస్తూ ఇటీవల పట్టుబడిన సురేశ్‌పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇప్పటికే చాలాసార్లు పల్టుబడిన శ్రీరాములుపై పీడీయాక్ట్ నమోదు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు.
సిబ్బందికి ఎస్పీ ప్రశంస
విధి నిర్వహణలో చురుకుగా పనిచేసిన తొర్రూరు, మరిపెడ, నర్సింహులపేట సిబ్బందిని ఎస్పీ ప్రశసించారు. తొర్రూర్, మరిపెడ సీఐలు నూనావత్ సాగర్, కరుణ, నర్సింహులపేట ఎస్సై లావుడ్యా నరేశ్, మరిపెడ ఎస్సై ప్రవీణ్‌కుమార్‌తో పాటు సిబ్బంది సమ్మీలాల్, క్రాంతికుమార్, రవీందర్, ఈర్యా, ప్రణీత్‌ను అభినందించి రివార్డులు అందజేశారు.