ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్వర్
గులాబీ గూటికి కాంగ్రెస్ నాయకులు
ములుగు రూరల్, అక్టోబర్ 7 : సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీకి ఆయువుపట్టని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. మండలంలోని మల్లంపల్లి గ్రామంలో ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం పొగుళ్లపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బైరబోయిన సదానందం తన అనుచరులతో కలిసి జడ్పీ చైర్మన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జగదీశ్వర్ మాట్లా డుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు అకర్షితులై ఎంతో మంది టీఆర్ఎస్లో చేరు తున్నారని చెప్పారు. అనంతరం మహ్మద్‌గౌస్‌పల్లి గ్రా మానికి చెందిన స్రవంతికి రూ.22,500 సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కాగా జడ్పీ చైర్మన్ ఆమెకు అందజే శారు. వాచర్ల సంఘం ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి బల్గూరి బాబు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ కొత్తగూడ మండల అధ్యక్షుడు వేణు, ఓడీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సాయికిరణ్, నెహ్రూనాయక్, వీరన్న, రమేశ్, రవి, మల్లయ్య, సాంబయ్య, బాలకొమురు, యాకయ్య, నాగేశ్వర్రావు, చిరంజీవి, శ్రీను, బుచ్చిరాములు, ఉత్తరయ్య, రామ్మోహన్, శ్రీనివాస్, వెంకన్న, పార్టీ ములుగు మండల అధ్యక్షుడు ప్రవీణ్, నాయకులు గోవిందనాయక్, ఎంపీటీసీ ప్రభాకర్, శ్రీనివాస్, సాగర్, శ్రావణ్, రవి, వాచర్లు కుమారస్వామి, మొగిలి, రాజు, రవి తదిదతరులు పాల్గొన్నారు.