15వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లాకు రూ.77.50 కోట్లు కేటాయింపు
281 జీపీలకు రూ.60 కోట్లు
మండల పరిషత్‌లకు రూ.9 కోట్లు
జిల్లా పరిషత్‌కు రూ.7 కోట్లు
గ్రామాల్లో అభివృద్ధి పరుగులు
నెరవేరుతున్న సీఎం కేసీఆర్ లక్ష్యం
జనగామ చౌరస్తా, అక్టోబర్ 7 :పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. సమైక్య పాలనలో అరకొర నిధులతో కనీసం తాగునీటి సమస్య కూడా తీరని దుస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు ‘గ్రామస్వరాజ్యం’ లక్ష్యంతో ముందుకుపోతున్నది. ఇందులో భాగంగా ‘మిషన్‌భగీరథ’ ద్వారా తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లాకు 2021-22 సంవత్సరానికి రూ.77.50 కోట్లు కేటాయించింది. 281 పంచాయతీలకు రూ.60 కోట్లు జమ కానుండగా గ్రామాల్లో అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి.
గ్రామాల సర్వోతా ముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందుకనుగుణంగా సీఎం కేసీఆర్ పల్లెల్లో మౌలిక వసతులు కల్పించేందుకు భారీగా నిధులు కేటాయిస్తన్నారు. ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం.. జిల్లాలోని గ్రామీణ ప్రాంత జనాభా 4,82, 279 మంది. ఇందులో ఎస్సీలు 1,03,921 మంది, ఎస్టీలు 60,717 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు 15వ ఆర్థిక సంఘం ద్వారా సుమారు రూ.77 కోట్ల 50 లక్షల 39 వేలు కేటాయించారు. ఇందులో జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సుమారు రూ.60 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.9 కోట్లు, జిల్లా పరిషత్‌కు రూ.7 కోట్లతో మొత్తం రూ.77 కోట్ల 50 లక్షల 40 వేలను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం జిల్లాలోని 281 గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా సుమారు రూ.5 కోట్ల 3 లక్షల 17 వేలను ప్రభుత్వం ఠంచనుగా జీపీల ఖాతాల్లో జమ చేస్తున్నది. అంటే 15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదల చేసిన నిధుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు 70 శాతం, మండల పరిషత్‌లకు 15 శాతం, జిల్లా పరిషత్‌కు 15 శాతం చొప్పున నిధులు కేటాయిస్తున్న ది.
ప్రతి నెలా నిధులు విడుదలవుతుండడంతో గ్రామా ల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ‘మిషన్భ గీరథ’తో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఫలితంగా పల్లెల్లోనూ తాగునీటి ఎద్దడి లేదు. ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులతో పారిశుధ్యం, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం పూర్తి చేయిస్తున్నారు. మరో వైపు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ, ఆరోగ్య ఉప కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఈ ఆర్థిక సంఘం ద్వారా కేటాయించిన మొత్తం నిధుల్లో 50 శాతం టైడ్ నిధులను కేవలం పారిశుధ్యం, తాగు నీటి సరఫరా కోసం ఉపయో గిస్తున్నారు. మిగతా 50 శాతం అన్‌టైడ్ నిధులను ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలకు వినియో గిస్తున్నారు. నిధుల రాకతో జిల్లాలోని పల్లెల రూపు రేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు పల్లెలు ప్రగతిబాట పట్టాయి.
జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ గ్రామ పంచాయతీలో 2011 జనాభా లెక్కల ప్రకారం.. 12 వేల 721 మం ది జనాభా ఉండగా, ఇందులో ఎస్సీలు 4 వేల 605 మంది, ఎస్టీలు 315 మంది ఉన్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లా పంచాయతీకి వస్తున్న ప్రభుత్వ నిధుల్లో ప్రతినెలా స్టేషన్‌ఘన్‌పూర్ పంచాయతీకి అత్యధికంగా సుమారు రూ.13 లక్షల 96 వేల కేటా యిస్తుండగా, 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చే ప్రభుత్వ నిధుల్లో ప్రతినెలా అత్యల్పంగా వీఎస్ ఆర్‌నగర్ గ్రామ పంచాయతీకి సుమారు రూ.37 వేల చొప్పున నిధులు కేటాయించింది.
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ద్వారా జిల్లా పంచాయతీకి కేటాయించిన నిధులు రూ.27 కోట్ల 74 లక్షల 26 వేలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ. 32 కోట్ల 63 లక్షల 84 వేలు కేటాయించింది. ఇదే క్రమంలో మండల ప్రజా పరిషత్‌లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సుమారు రూ.9 కోట్ల 22 లక్షల 6 వేలు, జిల్లా ప్రజా పరిషత్‌కు రూ.7 కోట్ల 90 లక్షల 24 వేల నిధు లను కేటాయించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ నిధుల వినియోగం జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుధ్యానికి, తాగునీటి వసతికి పెద్దపీట వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు, వర్షపు నీటి నిల్వ, తడి, పొడిచెత్త సేకరణ, సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించడం, కంపోస్టు ఎరువుల తయారీకి చర్యలు తీసుకోవడం చేయాలి. స్వచ్ఛభారత్ మిషన్‌లో చేపట్టే అన్ని అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగిం చుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. పారిశుధ్య కార్మికులకు అవసరమైన ఉపకరణాలు, చెత్త బుట్టల పంపిణీ, తాత్కాలిక సిబ్బంది వేతనాల చెల్లింపు కూడా ఈ నిధుల ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించింది. విష జ్వరాలు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పారిశుధ్య పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టడానికి ఈ నిధులు ఖర్చు చేయడానికి గ్రామ పంచాయతీలకు పూర్తి అవకాశం ప్రభుత్వం కల్పించింది.
జనాభా, విస్తీర్ణం ఆధారంగా నిధులు..
15వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లాలోని 281 పంచాయతీలకు జనాభా, విస్తీర్ణం ఆధారంగా సు మారు రూ. 60 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించింది. పంచాయతీల బ్యాంకు ఖాతాలో ప్రతినె లా ఈ నిధులు జమ చేస్తాం. దీం తో పల్లెల్లో పారిశుధ్యం, తాగునీటి సమస్యలు తీరాయి. ప్రభుత్వం నిధులు భారీగా ఇస్తుండడంతో గ్రామాల్లో ఇత ర మౌలిక వసతుల ఏర్పాటు ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం పల్లెల్లో ఎటుచూసినా పచ్చదనం, పా రిశుధ్యం, తాగునీరు, గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో కళకళలాడుతున్నాయి.