భూపాలపల్లి ఏరియా జీఎం శ్రీనివాసరావు
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
భూపాలపల్లి, ఆగస్టు 7 : భారతీయులంతా స్వదేశీ వస్తువులనే వాడాలని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ టీ శ్రీనివాసరావు సూచించారు. స్థానిక జీఎం కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుతో చేనేత కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 2015 ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ప్రతి భారతీయుడు స్వదేశీ వస్ర్తాలను ధరించాలని పిలుపునిచ్చారు. అనంతరం జీఎం చేతుల మీదు గా చేతి రుమాళ్లను ఉద్యోగులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఆర్. విజయప్రసాద్, ఏజీఎం ఎస్. జ్యోతి, ఎఫ్ఎం అనురాధ, ఎస్ఈ శ్రీనివాస్ కుమా ర్, బీ కృష్ణప్రసాద్, ఇన్చార్జి అధికార ప్రతినిధి శివకేశవ రావు, పీ రాజేశం, రజనీకుమార్, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
పారా మెడికల్ సిబ్బందిగా గుర్తించాలి
సింగరేణి ఏరియా దవాఖానలు, డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని పారామెడికల్ సిబ్బందిగా గుర్తించాలని తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్, భూపాలపల్లి ఏరియా ఇన్చార్జి జోగుల సమ్మయ్య సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు శనివారం భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం టీ.శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సింగరేణి దవాఖానల్లో పనిచేస్తున్న కాంట్రాక్ ్ట సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, పండుగలకు డబుల్ మస్టర్ ఇవ్వాలని, నెలకు ఒక సిక్ లీవ్, ఓవర్ టైమ్ వేతనం, బోనస్ సౌకర్యం కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. త్వరలోనే తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు చెప్పారు.
సమస్యలు పరిష్కరించాలి
ఎన్నికైన సభ్యులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు అన్నారు. ఇల్లందు క్లబ్లో జీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో భూపాలపల్లి ఏరియా సింగరేణి అధికారుల సంఘం సభ్యులు కొందరు ఉద్యోగ విరమణ, మరికొందరు బదిలీ అయ్యారు. వారి స్థానంలో నూతన సభ్యులను శనివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బచ్చ రవీందర్ (ఏఎస్వో), జనరల్ సెక్రటరీగా చిర్ర శ్రీనివాస్ (డిప్యూటీ మేనేజర్), జాయింట్ సెక్రటరీలుగా ముత్తు వేలు(డీవైఎస్ఈ), డాక్టర్ హరిప్రసాద్, కోశాధికారిగా ఎస్. రవీందర్ (అండర్‌మేనేజర్) ఎన్నికయ్యా రు. ఇల్లందు క్లబ్ సెక్రటరీగా ఆర్. విజయప్రసాద్ (ఎస్వోటూ జీఎం), స్పోర్ట్స్ సెక్రటరీగా మన్నన్ (సర్వే ఆఫీసర్), కల్చరల్ సెక్రెటరీగా మనోజ్‌కుమార్ ఈఈ (సివిల్), కోశాధికారిగా గుండు రాజు (సీనియర్ పీవో) ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఈ సందర్భంగా వారికి జీఎం శుభాకాంక్షలు తెలిపారు.