కలెక్టర్ డాక్టర్ బీ గోపి
కలెక్టరేట్లో పోషణ అభియాన్‌పై సమావేశం
గ్రీవెన్స్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ప్రజావాణికి అధికారులు తప్పకుండా హాజరుకావాలి
ఖిలావరంగల్, సెప్టెంబర్ 6 : ఆరోగ్య సమాజమే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ బీ గోపి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన పోషణ అభియాన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందించాలన్నారు. పోషణ మాసంలో భాగంగా పిల్లల్లో పోషకాహార లోపాన్ని గుర్తించాలన్నారు. తల్లి పాల ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ డాష్‌బోర్డు రికార్డులో చేయాలన్నారు. అలా గే ప్రభుత్వ పథకాలను అధికారులు ప్రజలకు చేరవేయాలన్నారు. అదనపు కలెక్టర్ హరిసింగ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఐసీడీఎస్ ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజలలో పూర్తి స్థాయి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో శారద, అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి..
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ గోపి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 15 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చే దరఖాస్తులను తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్‌కు అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు. కాగా, గత వారం వచ్చిన విన్నపాల్లో కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్ పాల్గొన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసిన కలెక్టర్..
గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలెక్టర్ బీ గోపి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.