స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 4 : దివ్యాంగులకు సరైన గౌరవంతోపాటు, గుర్తింపు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇందులో భాగంగానే వారికి ఆసరా పథకంలో ప్రతి నెలా రూ.3,016 పెన్షన్ ఇస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని భవిత దివ్యాంగుల కేంద్రంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంఈవో బత్తిని రాజేందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఇటీవల నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే రాజయ్య బహుమతులు అందించారు. ఆయన మాట్లాడుతూ మానసిక, శారీరక దివ్యాంగుల్లో ఆత్మైస్థెర్యం ఎక్కువగా ఉంటుందన్నారు. వీరికి ప్రజలు తమవంతు సహకా రం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తాటికొండ సురేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, ఎంపీడీవో కుమారస్వామి, మార్కెట్ డైరెక్టర్ చిగురు సరిత, గ్రామ అధ్యక్షుడు మునిగెల రాజు, మండల ప్రధాన కార్యదర్శి వారణాసి రామకృష్ణ, గుండె మల్లేశ్, మారపెల్లి ప్రసాద్, అకారపు అశోక్, ఎమ్మార్సీ సిబ్బంది గిరి, సునీత, లవన్, జ్యోతి, ప్రవీణ్, తులసి, భాగ్యలక్ష్మి, రవీందర్, రమేశ్ పాల్గొన్నారు.