లింగాలఘనపురం, డిసెంబర్ 4: రాష్ట్రంలోని గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలుగా విరాజిల్లుతున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయా న్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. గ్రంథాలయాలకు పాఠకులు వచ్చి వారి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. దీని కో సం పాఠకుల సంఖ్యను పెంచాలని, సభ్యులను ఎక్కువగా చేర్పించాలని, ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లాలన్నారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుధీర్, లైబ్రేరియన్ కృష్ణ పాల్గొన్నారు.
కొడకండ్ల : మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన గ్రంథాలయ భవన నిర్మాణ పనులను మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు సహకారంతో త్వరలోనే పూర్తి చేయిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి అన్నా రు. శనివారం మండల కేంద్రంలోని నూతనంగా నిర్మాణం చేపడుతున్న గ్రంథాలయ భవనాన్ని, గ్రంథాలయాన్ని పరిశీలించారు. అదే విధంగా ఎంపీడీవోను కలిసి గ్రామాల నుంచి గ్రంథాలయాలకు రావాల్సిన సెస్ విషయంపై మాట్లాడినట్లు తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సూధీర్రెడ్డి, లైబ్రేరియన్ సీతారాములు ఉన్నారు.