బతుకమ్మ చీరెల పంపిణీపై విపక్షాల విష ప్రచారం
పాతవాటిని కాల్చి బతుకమ్మ చీరెలుగా చిత్రీకరణ
చేనేత, జౌళి శాఖ, రెవెన్యూ విచారణతో వెలుగులోకి..
ప్రతిపక్షాలపై మహిళల అసంతృప్తి
ఆడబిడ్డల కానుకలపై అసత్య ప్రచారంపై ఆగ్రహం
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రతిపక్షాలు ఎంతటి నీచానికైనా తెగబడుతున్నాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు అందజేస్తున్న చీరెలు కాల్చి మానసికానందం పొందుతున్నాయి. చిట్యాల మండలం కైలాపూర్లో పాతవాటిని కాల్చేసి బతుకమ్మ చీరెలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి. ఈ సంఘటనపై చేనేత, జౌళి శాఖ, రెవెన్యూ శాఖల వారు విచారణ చేపట్టగా అసలు నిజాలు వెలుగు చూశాయి. రాజకీయ పార్టీల అసలు రంగు బయట పడింది. ప్రభుత్వం అందించిన చీరెలు నాణ్యమైనవని, వాటిని తాము కాల్చలేదని మహిళలు అధికారులకు వివరించారు. చిల్లర రాజకీయాలు తగవని ప్రతిపక్షాలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవుపలికారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు అందజేస్తున్న చీరెల పంపిణీపై ప్రతిపక్ష పార్టీలు తమ అక్కసు వెల్లగక్కుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని అభాసుపాలు చేసేందుకు శథవిధాలా ప్రయత్నిస్తున్నాయి. పండుగ వేళ ఆడపడుచులు కొత్త చీరెలు ధరించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చీరెలు అందజేస్తున్నారు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోనుంది. అలాంటి చీరెల పంపిణీలోనూ పనీపాటా లేని విపక్ష పార్టీల నా యకులు చిట్యాల మండలంలోని కైలాపూర్లో పనికట్టుకుని పాత చీరెలు తీసుకువచ్చి కాల్చివేసి బతుకమ్మ చీరెలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీనిపై మహిళలు సర్వత్రా అసంతృప్తి వ్యక్తం చేయడమే గాక, ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. వివిధ రంగుల్లో ఆకర్షణీయం గా ఉన్న చీరెలు నాణ్యతతో ఉన్నాయని, కావాలని ఇలా చేస్తున్న రాజకీయ పార్టీలపై కన్నెర్ర చేస్తున్నారు.
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే..
ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందిస్తుండడంతో తెలంగాణ ఆడపడుచులు ప్రభుత్వానికి అభిమానులుగా మారుతున్నారనే అక్కసుతో కావాలనే చీరెలు కాల్చి వేశారని జిల్లాలో జరిగిన సంఘటనలు అద్దంపడుతున్నాయి. పాత చీరెలను తీసుకువచ్చి కా ల్చి వేసి, బతుకమ్మ చీరెలుగా చిత్రీకరించేందుకు సకల ప్రయత్నాలు చేసి విఫలం చెందారు. ప్రతిపక్ష పార్టీల కుటిల ప్రయత్నాలను బతుకమ్మ చీరెలు పొందిన వా రు బట్టబయలు చేశారు. దీంతో తమ ప్లాన్ అట్టర్ ప్లాప్ కావడంతో చేతులు ముడుచుకుని కూర్చున్నారు. వా రికి చేతకాదు, చేసే వారిపై చిల్లర రాజకీయాలు చేస్తూ బురదచల్లుతున్నారని, దీనిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారనే విషయాన్ని మర్చి వ్యవహరిస్తున్నారు.
అధికారుల విచారణతో వెలుగులోకి..
ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరెలు కాల్చిన సంఘటనపై చేనేత, జౌళి శాఖ, రెవెన్యూ శాఖల వారు చేపట్టిన విచారణలో అసలు నిజాలు వెలుగుచూడడం తో పాటు రాజకీయ పార్టీల అసలు రంగు బయట ప డింది. చీరెలు నాణ్యమైనవి, వాటిని తాము కాల్చలేద ని సదరు మహిళలు అధికారులకు వెల్లడించారు. ఈ సంఘటనతో సదరు నేతల దిమ్మ తిరిగి పోయింది. ఏ దో రాద్దాంతం చేస్తే ఊరుకుంటారని భావించిన వారికి ప్రభుత్వం తక్షణ విచారణ చేపట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచని అయోమయంలోకి వెళ్లిపోయారు.
చీరెలు దహనం చేసిన వారిపై కేసు నమోదు
చిట్యాల, అక్టోబర్ 4 : చీరెలు దహనం చేసిన ఐదుగురు మహిళలపై కేసు నమోదు చేసీనట్లు ఎస్సై వీరభద్రరావు సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కైలాపూర్ గ్రామానికి చెందిన చింతల వనిత, మేకల శ్రీజ, మానస, కవిత, సుంచు మల్లక్క శనివారం బతుకమ్మ చీరలపేరుతో పాత చీరెలు తగలబెట్టినట్లు తెలిపారు. సోషల్ మీడియా, పలు దినపత్రికల్లో ప్రచారం అయ్యేలా చేసి పబ్లిక్ న్యూసెన్స్, ప్రభుత్వానికి అప్రతిష్టపాలు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎసై వివరించారు.