అన్నివర్గాల సంక్షేమమే సర్కారు ధ్యేయం
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
నర్మెట, డిసెంబర్ 3 : వృత్తిదారులకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ చేయూతనిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మత్స్యకారుల కోసం ఉచితంగా సరఫరా చేసిన లక్షా 29 వేల నీలకంఠ రొయ్య పిల్లలను శుక్రవారం మండలంలోని మల్లన్నగండి రిజర్వాయర్‌లో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వదిలారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో మూడు సంవత్సరాల్లో గోదావరి, కృష్ణ జలాలను రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని గుర్తు చేశారు. దీంతో సమృద్ధిగా పంటలు పండుతున్నాయని అన్నారు. రిజర్వాయర్ల నిర్మాణం, కరంట్ సదుపాయాలతో ధాన్యం దిగుబడులు పెరిగాయని ము త్తిరెడ్డి వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. అయినా ఈ సీజన్లో చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందని ముత్తిరెడ్డి వివరించారు. వరికి బదులు రైతులు చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలని కోరారు.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేయూత
మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నదని, రవాణాకు వాహనాలను సైతం సబ్సిడీతో ఇస్తున్నదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అందించిన ఉచిత నీలకంఠ రొయ్య పిల్లలను గండిరామవరం రిజర్వాయర్‌లో లక్షా 29 వేలు, వెల్దండ రిజార్వయర్‌లో 74 వేలు, బొమ్మకూరు రిజర్వాయర్‌లో 56 వేలు విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్, మత్స్యసొసైటీ జిల్లా అధ్యక్షుడు బుస్స మల్లేశం, సర్పంచ్‌లు భూక్యా శ్రీనివాస్‌నాయక్, బానోత్ శంకర్‌నాయక్, వైస్ ఎంపీపీ మంకెన ఆగిరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు ఆమెడపు కమలాకర్‌రెడ్డి, కల్యాణం మురళి, జడ్పీ కోఅప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, టీఆర్ఎస్ నర్మెట, తరిగొప్పుల మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్, నాయకులు నీరేటి సుధాకర్, పగడాల నర్సయ్య, కంతి రాజలింగం, పిట్టల రాజు, వంగాల గోవర్ధన్, జ్వాల కిషన్, గాదె జొజిరెడ్డి, నక్కల రవి, గడపురం శశిరత్, ఇట్టబోయిన రమేశ్, ఇర్రి కృష్ణారెడ్డి, చెప్యాల మహిపాల్‌రెడ్డి, కుంటి రమేశ్, బాపురాజు, చేర్యాల సత్యనారాయణ, గద్దల కిరణ్, గండిరామవరం రిజర్వాయర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు ఓడపల్లి రాజు, ప్రధాన కార్యదర్శి నీల యాదగిరి, ఉపాధ్యక్షులు చింతల శ్రీనివాస్, మిడిదొడ్డి మల్లయ్య పాల్గొన్నారు.