మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 3: రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని సింగారం, ఇస్లావత్ తండా(ఎస్) గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆరబెట్టిన, తేమశాతం తక్కుగా ఉన్న, నాణ్యమైన ధా న్యాన్ని తీసుకురావాలని సూచించారు. టీఆర్ఎస్ సర్కారు రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో వ్యవసాయ మార్కె ట్ కమిటీ వైస్‌చైర్మన్ సుధగాని మురళి, టీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు తేళ్ల శ్రీనివాస్, మండల మాజీ అధ్యక్షుడు యాస వెంకటరెడ్డి, సర్పంచులు బోడ లక్ష్మణ్‌నాయక్, గంగుల తేజమ్మ, నాయకులు జీ శ్రీనివాస్, భీమయ్య, శశికుమార్, ధర్మ, నరసింహ, బీ భద్రు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
డోర్నకల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి జీ రాజేందర్ అన్నారు. డోర్నకల్ వ్యవసాయ మార్కెట్లో మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ వైస్‌చైర్మన్ కేశబోయిన కోటిలింగంతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రేడ్ -ఏ రకం రూ. 1960, గ్రేడ్-సీ రకం రూ. 1940 ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కత్తెరశాల విద్యాసాగర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యామల నాగేందర్, వార్డు కౌన్సిలర్లు పోటు జనార్దన్, బసిక అశోక్, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్త రాంబాబు, ఏఈవో కరుణ, నాయకులు తేజావత్ రమేశ్, కొత్త వీరన్న, కేశబోయిన వెంకటేశ్, నల్లబోలు శ్రీనివాస్, రవికాంత్, సిబ్బంది అంజనేయులు, రైతులు పాల్గొన్నారు.
సకాలంలో కొనుగోళ్లు జరగాలి : అదనపు కలెక్టర్
బయ్యారం: సకాలంలో ధాన్యం కొనుగోళ్ల జరపాలని అదనపు కలెక్టర్ కొమురయ్య అన్నారు. మండలంలోని బయ్యారం, కొత్తపేట, నామాలపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కొనుగోలు చేయాలన్నారు. నిర్వాహకులు అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్ నాగభవాని, ఏపీఎం నర్సింహారావు, సొసైటీ చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఏఈవో సురేశ్ పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
కురవి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని జిల్లా ఉద్యానవన అధికారి కే సూర్యనారాయణ అన్నారు. మండలంలోని నేరడలో ధరణిపుత్ర రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంస్థ సభ్యులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ ఆంజనేయులు, నరసింహారెడ్డి, ఉద్యానవన అధికారి అనితశ్రీ, ఏఈవో రాజేశ్వరి, డెరెక్టర్లు యాదగిరి, వెంకన్న, దిలీప్ పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు : ఆర్డీవో
పెద్దవంగర : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్గించొద్దని, రైతులు సైతం నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని తొర్రూరు ఆర్డీవో రమేశ్‌బాబు అన్నారు. మండల కేంద్రంతో పాటు ఉప్పరగూడెం, అవుతాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా కాంటాలు వేయాలని, అనంతరం ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరితారాణి, సర్పంచులు జమున, మంజుల, ఏఈవోలు, రెవెన్యూ అధికారులు, పీఏసీఎస్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
చిన్నగూడూరు: కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని పీఏసీఎస్ సీఈవో నరేశ్ అన్నారు. మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన రైతులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. దళారి వ్యవస్థను అరికట్టేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో సెంటర్ ఇన్చార్జి కొమ్ము మధు, స్థానికులు బొమ్మ వెంకన్న,మక్క వెంకన్న, లింగన్న, శ్రీను, బాబు, సైదులు ఉన్నారు.