ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేస్తాం..
రైతులు ఆరుతడి పంటలు వేయాలి
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
లింగాలఘనపురం, డిసెంబర్ 3: మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు. మండలంలోని నాగరంలో పీఎంజీఎస్‌వై పథకంలో రూ. 4.55 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన, ఏనెబావిలో రూ. 6 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, జీడికల్లో లక్షతో నిర్మించనున్న పాఠశాల ప్రహరీకి శంకుస్థాపన, వడిచర్లలో రూ. 6 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన, పటేలగూడెంలో రూ. 8 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుకు ప్రారంభోత్సవం, కుందారంలో రూ. 5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన ఎమ్మెల్యే శుక్రవారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలకు ఆయా సర్పంచ్‌లు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మం డలంలోని ప్రతి గ్రామంలోని ప్రతి వాడా సీసీ రోడ్ల మయం కావాలన్నదే తన తపన అన్నారు. నాగారం నుం చి లింగాలఘనపురం ద్వారా పటేలుగూడెం వరకు 8.3 00 కిలో మీటర్ల బీటీ రోడ్డును వేయిస్తున్నామన్నారు. ఈ పర్యాయం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజా కొ లుగోలు చేస్తామన్నారు. కేంద్రం వైఖరితో యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. బీజేపీ నాయకులు ఇక్కడో మాట..అక్కడో మాట మాట్లాడుతున్నారన్నారు. రైతులు ఇతర పంటలు వేసుకోవాలని సూచించారు.
వికలాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లాలి..
వికలాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. లింగాలఘనపురంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో ఎక్కువ మంది దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి వాహనాలు అందించే ప్రయ త్నం చేస్తామన్నారు. ఎంపీపీఈ చిట్ల జయశ్రీ, జడ్పీటీసీ గుడి వంశీదర్‌రెడ్డి, కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ సంపత్, విండో చైర్మన్ ఎం శ్రీశైలం, వైస్‌ఎంపీపీ కొండబోయిన కిరణ్‌కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్‌గౌడ్, ఇన్చార్జిలు బొల్లంపెల్లి నాగేందర్, ఉడుగుల భాగ్యలక్ష్మి, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వడిగం ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి దామెర రమేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు నరేశ్, మండల అధ్యక్షుడు కొండబోయిన లక్ష్మణ్, కార్యదర్శి మల్లేశం, బాధ్యులు శోభ, మంజుల, టీఆర్ఎస్ నాయకులు గవ్వల మల్లేశం, గట్టగల్ల శ్రీహరి, విష్ణు, అంజనేయులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.