టేకుమట్ల, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ఫలాలు ఏదో ఒక రకంగా గడప గడపకూ చేరాయని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీలో ఆదివారం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు, బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను గుర్తించి సంక్షేమ పథకాలు రూపొందించారు. దళారుల బెడద లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందేలా అందేలా చూస్తున్నారని చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో పయనించేలా కృషి చేస్తున్నారని అన్నారు. తాను కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రేవంత్‌రెడ్డి తనపై చేసిన అసత్యపు ఆరోపణలను నిరూపించాలని పిలుపునిచ్చారు. తప్పు చేసినట్లు రుజువైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకుంటే రేవంత్ రెడ్డి ముక్కు భూమికి రాస్తావా అని సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డిపై పరువు నష్టందావా వేస్తానని ఈ సందర్భంగా అన్నారు. కొత్త బిచ్చగాళ్ల అవతారం ఎత్తిన కొంత మంది చెంచాగాళ్లు తనపై అసత్యపు ఆరోపణలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే జీర్ణించుకోలేని వారు రాజీనామా చేయాలనడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏందో ప్రజా క్షేత్రంలో తెలుసుకుందామన్నారు. అనంతరం మండలంలోని అంకుషాపూర్, సోమనపల్లి, వెల్లంపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాల్లో సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ ఐలమ్మ, డీటీ రవీందర్రావు, ఆర్ఐ అచ్చారావు, సీనియర్ అసిస్టెంట్ విజయ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోపలువురి చేరిక
గణపురం : మండలంలోని వెంకటేశ్వర్లపల్లి ఉప సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ, ఏఐఎఫ్బీ కార్యకర్తలు 50 మంది ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో వెంకటేశ్వర్లపల్లి ఉప సర్పంచ్ బక్కతట్ల సమ్మయ్య, నక్క సంపత్, కీర్తి కోటేశ్, దుర్గం రాములు ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలసాని లక్ష్మీనరసింహరావు, పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పొట్ల నగేశ్, సర్పంచ్ నారగాని దేవేందర్‌గౌడ్, నడిపెల్లి మధుసూదన్‌రావు, ఐలోని శశిరేఖ రాంచంద్రారెడ్డి, కుమారస్వామి, మామిడి రవి, రామంచ భద్రయ్య, ఉప సర్పంచ్ పోతర్ల అశోక్‌యాదవ్, ఎంపీటీసీలు శివశంకర్‌గౌడ్, చెన్నూరి రమాదేవి, పొనగంటి సుందర్మ మలహల్ రావు, మంద అశోక్‌రెడ్డి, మోతె కర్ణాకర్‌రెడ్డి, మారగని శ్రీనివాస్, వడ్లకొండ నారాయణ గౌడ్, ఒద్దుల అశోక్‌రెడ్డి, మామిండ్ల సాంబయ్య, గంగాధర్ రావు, చెన్నూరి మధుకర్, మలహల్ రావు, డాక్టర్ జానయ్య, కోల జనార్దన్, గుజ్జ గంగాధర్‌రావు, బోయిని సాంబయ్య పాల్గొన్నారు.