గణపురం, అక్టోబర్ 3 : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని విమర్శించే హక్కు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి లేదని టీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు పోలసాని లక్ష్మీనరసింహరావు అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు గుర్రం తిరుపతిగౌడ్ అధ్యక్షతన విలేకరుల సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలసాని లక్ష్మీనరసింహరావు మాట్లాడుతూ.. నీచ చరిత్ర కలిగిన రాజేందర్‌రెడ్డి ఎమ్మెల్యేను విమర్శించడం సరికాదన్నారు. గండ్ర సత్యనారాయణరావుకు పార్టీలు మారడం కొత్తేమి కాదని, అన్ని పార్టీలు తిరిగి చివరికి కాంగ్రెస్‌లో చేరాడన్నారు. నిత్యం ప్రజల బాగోగుల కోసం పరితపించే ఎమ్మెల్యే గండ్రను నాయిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పొట్ల నగేశ్, సర్పంచ్ నారగాని దేవేందర్‌గౌడ్, నడిపెల్లి మధుసూదన్‌రావు, ఐలోని శశిరేఖ రాంచంద్రారెడ్డి, కుమారస్వామి, మామిడి రవి, రామంచ భద్రయ్య, ఉప సర్పంచ్ పోతర్ల అశోక్‌యాదవ్, ఎంపీటీసీలు శివ శంకర్‌గౌడ్, చెన్నూరి రమాదేవి, పోనగంటి సుందర్మ మలహల్రావు, మంద అశోక్ రెడ్డి, మోతె కర్ణాకర్‌రెడ్డి, మారగాని శ్రీనివాస్, వడ్లకొండ నారాయణగౌడ్, ఒద్దుల అశోక్ రెడ్డి, మామిండ్ల సాంబయ్య, గంగాధర్‌రావు, చెన్నూరి మధుకర్, మలహల్రావు, డాక్టర్ జానయ్య, కోల జనార్ధన్, గుజ్జ గంగాధర్‌రావు, బోయిని సాంబయ్య, వడ్ల యాదగిరి, హఫీజ్, కసిరెడ్డి వెంకన్న పాల్గొన్నారు.
గండ్ర సత్యనారాయణరావు దిష్టిబొమ్మ దహనం
రేగొండ, అక్టోబర్ 3 : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్న గండ్ర సత్యనారాయణరావు దిష్టిబొమ్మను మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు అంకం రాజేందర్, మటిక సంతోష్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూటకో పార్టీ మార్చే సత్యనారాయణరావు ఎమ్మెల్యేను విమర్శించే అర్హత లేదన్నారు. నిత్యం ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటున్న ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతల పతనం తప్పదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సాయిని ముత్యంరావు, ఐత శ్రీధర్ గౌడ్, భిక్షపతి, పాపిరెడ్డి, సంతోష్ పాల్గొన్నారు.