చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణి
కాజీపేటలో మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీ
ధర్మసాగర్, వేలేరులో పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజయ్య
కాజీపేట, అక్టోబర్ 3 : రాష్ట్రంలోని సర్వమతాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభు త్వ ధ్యేయమని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. కాజీపేటలోని మున్సిపల్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో డిఫ్యూటీ కమిషనర్ రవీందర్‌యాదవ్ అధ్యక్షతన 47, 48, 61, 62, 63వ డివిజన్లకు చెందిన మహిళలకు బతుకమ్మ చీరెలను ఆదివారం సాయంత్రం పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రకమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్రంలో జరుగడం లేదన్నారు. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకు మహిళలకు చీరెలను అందించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న బతుకమ్మ చీరె ప్రతి ఆడబిడ్డకు అందేలా చూడాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, ఎలకంటి రాములు, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు సుంచు కృష్ణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నార్లగిరి రమేశ్, గబ్బెట శ్రీను, సోనీ, మాజీ కార్పొరేటర్లు కోల వినోద, సుంచు అశోక్, మర్యాల కృష్ణ, అయ్యాల దానం, మహమూద్, సిరిల్, కొండ్ర శంకర్, పాము రాజేశ్, అఫ్జల్ సూపరింటెండెంట్ అనిల్, ఆర్ఐ రమేశ్, ఆర్పీలు, ఓబీలు, మహిళలు పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు అండగా సర్కార్
ధర్మసాగర్/వేలేరు : ఆడబిడ్డలకు తెలంగాణ సర్కార్ అండగా ఉంటుందని స్టేసన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య అన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఎంపీడీవో జవహర్‌రెడ్డి అధ్యక్షతన బతుకమ్మ చీరెల పంపి ణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాజయ్య పాల్గొని మా ట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పండుగలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. మండలానికి మొత్తం 18,221 చీరెలు రాగా, ధర్మసాగర్లో 3,100 చీరెలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత, ఏఎంసీ వైఎస్ చైర్మన్ కరంచంద్, సర్పంచ్ శరత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునిగెల రాజు, ఎంపీటీసీలు వనమాల, శోభ, మండల అధికార ప్రతినిధి దేవేందర్ రావు, చాడ కుమార్, పంచాయతీ కార్యదర్శి మహేశ్, మండల మహిళా అధ్యక్షురాలు రాజమణి, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన ఓర్సు రాజుకు రూ. 26వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. అలాగే, వేలేరు మండల కేంద్రంలో సర్పంచ్ కాయిత మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొ ని మహిళలకు బతుకమ్మ చీరెలను పంపి ణీ చేశారు. ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరితారెడ్డి, వైస్‌ఎంపీపీ ఆంగోతు సంపత్, ఆత్మ జిల్లా చైర్మన్ కీర్తి వెంకటేశ్వర్లు, కుడా అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ బిల్లా యాదగిరి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహారావు, ఎంపీటీసీ సంధ్య, యూత్ అధ్యక్షుడు గోవింద సురేశ్, ప్రభాకర్, జోగు ప్రసాద్ పాల్గొన్నారు.