దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు
ఓర్వలేకే విపక్షాల ఆరోపణలు.. కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటాం
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
అమ్మాపురంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో భారీగా చేరిక
నర్మెట, అక్టోబర్ 31 : నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని అమ్మాపురంలో యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కే కమలాకర్, ఈ చంద్రారెడ్డితో పాటు బీజేపీ నుంచి సుమారు వంద మంది కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా గ్రామంలో కార్యకర్తలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్ పథకాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ముత్తిరెడ్డి తెలిపారు. మరో ఇరవై సంవత్సరాల వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన అన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామన్నారు. అనంతరం అమ్మాపురం నుంచి వంగపల్లి, లద్నూర్, అక్కరాజుపల్లి గ్రామం వరకు రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అమ్మాపురం గ్రామం చుట్ట్టు పక్కల రోడ్ల పరిస్థితిపై పూర్తి నివేదిక అందించాలని కోరారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయిస్తానని ఆయన తెలిపారు.
సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై టీఆర్ఎస్లో చేరా..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై టీఆర్ఎస్లో చేరానని కే కమలాకర్ పేర్కొన్నారు. జనగామ నియోజకవర్గంలోని చెరువులు, కుంటలకు గోదావరి జలాలు అందించడంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కృషిని కొనియాడారు. సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదన్నారు. అనంతరం టీఆర్ఎస్లో వలాద్రి రాజు, బండి మల్లారెడ్డి, సన్నపురి శ్రీనివాస్, కుంటి భాస్కర్, పండ్ల నర్సయ్య, ఎర్ర భాస్కర్, ఎర్రబోతుల యాదగిరి, నర్సయ్య, లక్ష్మి, ఎర్రబోతుల కల్యాణ్‌కుమార్, ఏ నర్సయ్య, పీ శేఖర్, మల్లేశ్, పీ సరిత, కుంటి యాదమ్మ, కుంటి భారతమ్మ, బండి రాజు, పండ్ల యాదగిరి చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, టీఆర్ఎస్ నర్మెట, తరిగొప్పుల మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కేశిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ పిట్టల రాజు, వైస్ ఎంపీపీ మంకెన ఆగిరెడ్డి, సొసైటీ డైరెక్టర్ బోగ అంజయ్య, యూత్ మండలాధ్యక్షుడు పార్నంది సతీశ్‌శర్మ, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు నీరేటి సుధాకర్, గ్రామ అధ్యక్షుడు పుట్ట కృష్ణంరాజు, టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు చెక్కిళ్ల విజయ, స్వర్ణలత, వార్డు సభ్యు లు చెక్కిళ్ల రాజు, పుట్ట లత, నాయకులు పగడాల నర్సయ్య, చెక్కిళ్ల రవీందర్, లింగాల సిద్ధ్దయ్య, సత్యనారాయణ, బీసీ సెల్ మండల అధ్యక్షుడు సలేంద్రి యాదగిరి, ఉపాధ్యక్షుడు నరేశ్, యూత్ అధ్యక్షుడు శ్రీరాం నాగరాజు, ప్రధాన కార్యదర్శి నాగార్జున, నాయకులు ఇట్టబోయిన రమేశ్, బండి తిరుపతిరెడ్డి, కొర్ర రాజ్‌కుమార్ పాల్గొన్నారు.