కూరగాయల సాగు, డెయిరీ ఫాంలకు ప్రభుత్వ సబ్సిడీ
దొడ్డయ్య మాటుపై కాజ్వే
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జంగేడులో పోచమ్మ ఆలయానికి భూమి పూజ
ఏడాదిలోపు నిర్మాణం పూర్తి
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 31 : నిరుద్యోగులు ప్రభుత్వ కొలువుల కోసం చూడకుండా స్వయం ఉపాధిపై దృష్టి సారించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు శివారులో పోచమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జంగేడులో పోచమ్మ గుడి నిర్మించాలని ప్రజలు అడిగారని, ఇచ్చిన హామీ మేరకు ఆలయ నిర్మాణానికి నేడు భూమి పూజ చేశానని తెలిపారు. జంగేడు, కాశీంపల్లి, వేశాలపల్లి గ్రామాల ప్రజలకు ఆలయం అందుబాటులో ఉంటుందన్నారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. కూరగాయల సాగు, డెయిరీ ఫాం లాంటి పనులపై నిరుద్యోగులు దృష్టిపెట్టి వృద్ధిలోకి రావాలని కోరారు. ప్రభుత్వం పరిశ్రమలకు సబ్సిడీ ఇస్తున్నదని గుర్తు చేశారు.
దొడ్డయ్యమాటుపై కాజ్వే
జంగేడు శివారులో పోచమ్మ ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న దొడ్డయ్య మాటుపై లో లెవల్ కాజ్వే నిర్మించాలని ఎమ్మెల్యే గండ్ర మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పోచమ్మ ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న దొడ్డయ్య మాటును ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. వర్షాకాలంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నదని, దీంతో పంట పొలాల వద్దకు వెళ్లడం ఇబ్బందిగా మారుతుందని గ్రామస్తులు ఎమ్మెల్యేకు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే మాటుపై లోలెవల్ కాజ్వే నిర్మాణ పనులు చేపట్టాలని, పోచమ్మ ఆలయం నిర్మించేలోగా ఈ పనులు పూర్తి కావాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబును వార్డు కౌన్సిలర్ దార పూలమ్మ, కోఆప్షన్ సభ్యుడు దొంగల ఐలయ్య యాదవ్ సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్, డైరెక్టర్ బెడ్డల పోచయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మందల విద్యాసాగర్‌రెడ్డి, కౌన్సిలర్లు మంగళంపల్లి తిరుపతి, చల్లా రేణుక, వజ్రమణి, నేతలు సెగ్గం సిద్ధు, బుర్ర రమేశ్, బండారి రవి, తాటి అశోక్, అట్కాపురం శ్రీను, బీబీ చారి, ఆకుదారి రాయమల్లు, చిరంజీవి, బిల్లా అశోక్‌రెడ్డి, బొంతల సతీశ్, పోలవేన అశోక్, అల్లూరి కుమార్, కటకం సారంగపాణి, తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.