పరకాల ఎంపీపీ స్వర్ణలత
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
పరకాల, జూన్ 30: పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ టీ స్వర్ణలత అన్నారు. పరకాలలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అధికారులపై చర్యలకు సభ పలు తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎక్సైజ్ శాఖ అధికారులు గత మూడు సమావేశాలకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాలాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. నేడు ప్రారంభమయ్యే పల్లెప్రగతిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సిలివేరు మొగిలి, వైస్ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవో బాలకృష్ణ పాల్గొన్నారు.
మొక్కలే జీవనాధారం
ఖానాపురం: మొక్కలే మానవ మనుగడకు జీవనాధారమని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు అన్నారు. బుధరావుపేటలో ఇంటింటికీ 6 మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ కాస ప్రవీణ్‌కుమార్, ఎంపీటీసీ షేక్ సుభాన్‌బీ, మౌలానా, కార్యదర్శి రజిత, వార్డు సభ్యులు జమాల్‌పాషా, సోమారపు మణెమ్మ, గుగులోత్ వెంకన్న, సాంబరాజు, పడాల రాంనర్సింహారెడ్డి, సుధాకర్, అల్లావుద్దీన్, కొలిశెట్టి పూర్ణచందర్రావు పాల్గొన్నారు.
గీసుగొండ: ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి బాలకృష్ణ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. మొక్కలును అధి క మొత్తంలో నాటాలని, పరిశుభ్రత విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు రాజీపడొద్దన్నారు.
సంగెం: పల్లెప్రగతిపై ఎంపీపీ కందకట్ల కళావతి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎంపీపీ సూచించారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి జీవరత్నం, ఎంపీడీవో ఎన్ మల్లేశం, తహసీల్దార్ విశ్వనారాయణ, రైతుబంధు మండల కన్వీనర్ కందకట్ల నరహరి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, ఎంపీవో కొమురయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పులుగు సాగర్‌రెడ్డి పాల్గొన్నారు.