Jangaon | జనగామ : జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా బండ్లగూడెం కస్తూర్బా పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల గదులను పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థినులతో కలిసి భోజనం చేసి భోజనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.