ఎల్కతుర్తి, ఏప్రిల్ 24 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను గురువారం సాయంత్రం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిపై వారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. సభావేదిక, హెలిప్యాడ్, తమ నియోజకవర్గాలకు కేటాయించిన పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. తమ ప్రాంతాల నుంచి ప్రజలు ముందుగానే సభా వేదికకు వచ్చేలా చూస్తామని వారు చెప్పారు. రజతోత్సవ బహిరంగ సభ గతంలో జరిగిన సభల కంటే చరిత్రలో నిలిచిపోతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
బచ్చన్నపేట, ఏప్రిల్ 24 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉప్పెనలా కదిలి రావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ సభకు మండలం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు తరలిరావాలన్నారు. పార్టీ ఆధ్వర్యంలో బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. సభకు వచ్చే ముందు ప్రతి గ్రామంలో గులాబీ జెండాలను ఆవిష్కరించాలన్నారు.
Palla Rajeshwar Reddy
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, వైస్‌చైర్‌పర్సన్ మద్దికుంట రాధ, మాజీ ఎంపీపీ బావండ్ల నాగజ్యోతీకృష్ణంరాజు, వైస్ ఎంపీపీ అనిల్‌రెడ్డి, ఇర్రి రమణారెడ్డి, మండల అధ్యక్షుడు చెంద్రారెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు సతీశ్‌రెడ్డి, కనకయ్య, నాయకులు చల్లా శ్రీనివాస్‌రెడ్డి, కొండి వెంకట్‌రెడ్డి, నరేందర్, షబ్బీర్, ఫిరోజ్, సిద్దారెడ్డి, కిష్టయ్య, ఆజాం, కోనేటి స్వామి, రాజుగౌడ్, శ్రీశైలం, రాజనర్సు, సిద్ధారెడ్డి, భాస్కర్‌రెడ్డి, నర్సింహులు, మల్లారెడ్డి, మల్లేశం, భాస్కర్, శ్రీధర్, ప్రతాప్‌రెడ్డి, వినోద్ తదితరులుపాల్గొన్నారు.