హనుమకొండ, ఏప్రిల్ 12: ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమన్యాలు స్పం దించి, సమస్యను పరిష్కరించాలని, లేకుంటే సమ్మె ఉధృతం చేస్తామని టీవీఏసీ జేఏసీ ట్రాన్స్కో రాష్ట్ర కన్వీనర్ కందికొండ వెంకటేశ్ హెచ్చరించారు. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మె ఆదివారం ఐదో రోజుకు చేరింది. ములుగు రోడ్డు ట్రాన్స్కో సరిల్ ఆఫీస్ వద్ద సమ్మె వేదికపై వెంకటేశ్ మాట్లాడుతూ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిషరించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు.
ప్రభుత్వ పెద్దలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చి ఇప్పుడు ఆర్టిజన్ అంటే ఏమిటని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే, హనుమకొండ నక్కలగుట్టలోని సర్కిల్ కార్యాలయం ఆవరణ సమ్మె వేదిక వద్దకు పెద్ద సంఖ్యలో విద్యుత్ కార్మికులు చేరుకొని సమ్మెలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జేఏసీ ట్రాన్స్కో ఉమ్మడి జిల్లా చైర్మన్ ఐలయ్య, కన్వీనర్ రాజన్న, జనరల్ సెక్రటరీ సునీల్, కోచైర్మన్ సృజన, నాయకులు సీహెచ్ రమేశ్, రాజేశ్ నాయక్, ఆనంద్, మూర్తి, రవి, పూర్ణ, కుమార్, తిరుపతి, ఇందిర, రమేశ్, రామచందర్, సంజీవ, రవీందర్, కిరణ్, ప్రవీణ్, శ్రీనివాస్, రజినీకాంత్, కొమురయ్య, రాజేందర్, ప్రభాకర్, సురేశ్ పాల్గొన్నారు.