హనుమకొండ, సెప్టెంబర్ 26: కాకతీయ విశ్వవిద్యాలయ స్టూడెంట్స్అఫైర్స్ డీన్‌గా జువాలజీ విభాగం ప్రొఫెసర్ ఎం.ఇస్తారిని ఒక సంవత్సర కాలానికి నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి ఆదేశాలమేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ ఇస్తారి గతంలో జువాలజీ విభాగాధిపతిగా, పాఠ్యప్రణాళిక అధ్యక్షుడిగా, వసతిగృహ సంచాలకులుగా, టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.
52 జాతీయ, 4 అంతర్జాతీయ సదస్సులలో మొత్తం 130 పరిశోధన పత్రాలు సమర్పించారు. 10 పేటెంట్లు కలిగి ఉన్నారు. ఆయన పర్యవేక్షణలో 13 మంది పరిశోధకులు పీహెచ్డీ పట్టాలు పొందారు. ఈ సందర్భంగా పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు ఇస్తారిని అభినందించారు.