దుగ్గొండి, మే, 7: అత్యంత భక్తి శ్రద్ధలతో గొల్ల, కురుమల ఆరాధ్య దైవమైన అక్క మహంకాళి దేవి, బీరన్నల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం బుధవారం మండలంలోని గిర్నిబావి గ్రామంలో మూడు రోజులపాటు కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. తొలి రోజు వేద పండితులతో గణపతి పూజను నిర్వహిస్తూ కోలాటాలతో విగ్రహాలను పూజలు నిర్వహించి, ఊరేగింపుగా తీసుకెళ్తూ భక్తులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షుడు బండారి రాజకుమార్, అమ్మ కుమారస్వామి, నరిగే ఐలయ్య, బుడిగొండ చంద్రయ్య, కొక్కర గొండ ఆంజనేయులు, అన్న లింగన్న, నరిగే భిక్షపతి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.