కళాక్షేత్రం పనుల్లో వేగం పెంచాలి
కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పురోగతి పనులపై బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్యాదవ్తో కలిసి కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
- కాళోజీ ఖ్యాతి, ప్రాముఖ్యత, చరిత్ర తెలిపేలా నిర్మాణం ఉండాలి
- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనలు పాటించాలి
- నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడొద్దు
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
- కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి పనుల పరిశీలన
హనుమకొండ, ఆగస్టు 9: కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పురోగతి పనులపై బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్యాదవ్తో కలిసి కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్ర నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాళోజీ ఖ్యాతి, ప్రాముఖ్యత, విశిష్టత, చరిత్ర తెలిపేలా నిర్మాణ పనుల్లో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కళాక్షేత్రం నిర్మాణంలో సైతం శ్రద్ధ తీసుకోవాలని చీఫ్ విప్ అధికారులకు సూచించారు.
ఆడిటోరియం నిర్మాణంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. కాళోజీ విగ్రహం, చిత్రమాలికకు ప్రత్యేక స్థానాలను కేటాయించాలని సూచించారు. కాళోజీ కాళోజీ ఫౌండేషన్, కవి సమ్మేళనాల నిర్వహణకు ప్రత్యేక సదుపాయం కల్పించాలన్నారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయడంతోపాటు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఆడిటోరియం, ఎంట్రెన్స్, సౌండ్‌సిస్టం, సీటింగ్ పనుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కాళోజీ కళాక్షేత్ర నిర్మాణంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గతంలో చేసిన సూచనలను తప్పకుండా పాటించాలన్నారు. కార్యక్రమంలో కుడా సీపీవో అజిత్‌రెడ్డి, డీఈఈ రఘునందన్‌రావు, కాళోజీ ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్‌రావు, నిర్మాణ బాధ్యులు నవీన్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

