ఆధార్ కేంద్రాల్లో వసూళ్లపై విచారణ
ఆధార్ కేంద్రాల్లో నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారికి జనగామ జిల్లా కలెక్టర్ ఆదేశా లు జారీ చేశారు. నిర్ణీత ధరల కంటే ఎక్కువ తీసుకుంటున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంతోపాటు కేంద్రాల గుర్తింపు రద్దు చేయాలని కూ డా ఆదేశించారు.
- నిర్ధారణ అయితే కేంద్రం గుర్తింపు రద్దు
- జిల్లా వ్యాప్తంగా ఇక ఆకస్మిక తనిఖీలు
- ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్‌రెడ్డి స్పష్టీకరణ
జనగామ, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ఆధార్ కేంద్రాల్లో నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారికి జనగామ జిల్లా కలెక్టర్ ఆదేశా లు జారీ చేశారు. నిర్ణీత ధరల కంటే ఎక్కువ తీసుకుంటున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంతోపాటు కేంద్రాల గుర్తింపు రద్దు చేయాలని కూ డా ఆదేశించారు. ఆధార్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మార్పునకు రూ.50, బయోమెట్రిక్ అప్డేట్కు రూ.100, ఆధార్ రంగు ప్రింట్, ఈ-ఆధార్ డౌన్‌లోడ్‌కు రూ.30 మాత్రమే వసూలు చేయాలని, అంతకుమించి తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీకి తెగబడుతున్న విషయంపై సోమవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘దోచుకుంటున్నారు.. ఆధార్ సెంటర్లలో అడ్డగోలు వసూళ్లు’ శీర్షికన కథనం ప్ర చురితమవడంతో జిల్లా యంత్రాంగం స్పం దించింది. ప్రతి ఆధార్ కేంద్రంలో నిర్ణీత ధరల పట్టికను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని, వసూలు చేసిన మొత్తానికి రశీదు ఇవ్వాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. జిల్లాలోని అన్ని ఆధార్ కేంద్రాల పనితీరును నిత్యం పర్యవేక్షించి, ఆకస్మిక తనిఖీలు చేయాలని కలెక్టర్ ఆదేశించారన్నారు. ఏదైనా కేంద్రం నిర్వాహకులు ఈ నిబంధనలు పాటించకుంటే ప్రజలు కలెక్టరేట్లోని ఫిర్యాదుల విభాగం లేదా టోల్‌ఫ్రీ నంబర్ 18004256605కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

