మహనీయుల త్యాగాలతోనే దేశానికి స్వాతంత్య్రం
ఎందరో మహనీయుల కృషి, త్యాగ ఫలితాలతోనే స్వాతంత్య్రం వచ్చిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జనగామ పట్టణ కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌లో ఏర్పాటు చేసిన ‘స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో గ్యాలరీ’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరై ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆనాటి స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను ఆసక్తిగా తిలకించారు
- ఆదర్శమూర్తుల స్ఫూర్తికనుగుణుంగా తెలంగాణ సర్కారు పాలన
- జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
- జాతీయ సమైక్యతను చాటాలని ప్రజలకు పిలుపు
జనగామ చౌరస్తా, ఆగస్టు 14 : ఎందరో మహనీయుల కృషి, త్యాగ ఫలితాలతోనే స్వాతంత్య్రం వచ్చిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జనగామ పట్టణ కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌లో ఏర్పాటు చేసిన ‘స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో గ్యాలరీ’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరై ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆనాటి స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఫొటో గ్యాలరీతో ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుల పోరాట ఘట్టాలను ఒక్కొక్కటిగా కండ్లకు కట్టినట్లు చూ పించడం అభినందనీయమన్నారు.
ఆనాటి పోరాట యో ధుల కృషిని, త్యాగాలను గ్రామాలు, మండలాలు, జిల్లాలతో పాటు పెద్ద పెద్ద పట్టణాలకు చెందిన ప్రజలందరూ తలుచుకొని స్మరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేసి, వజ్రోత్సవం ఘనంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఎస్బీఐ బ్యాంకు సేవల్ని ఖాతాదారులతో పాటు జిల్లా ప్రజలకు మరింత విస్తృతపర్చాలని ఆకాంక్షించారు. అనంతరం జనగామ ఎస్బీఐ బ్యాంకు చీఫ్ మేనేజర్ శిరీష మాట్లాడుతూ ఆగస్టు 14న ఆర్టీషియన్ మహారాజ్ స్మారక 75వ వార్షికోత్సవ వేడుకలను తమ జనగామ బ్రాంచ్ జరుపుకోవడంతో పాటు 75వ వజ్రోత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలను ఫొటో గ్యాలరీ రూపంలో ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య, కౌన్సిలర్లు బండ పద్మ, పేర్ని స్వరూప, తాళ్ల సురేశ్ రెడ్డి, మల్లిగారి రాజు, ఉల్లెంగుల సందీప్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే సర్కారు లక్ష్యం..
తరిగొప్పుల : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మరియాపురం సర్పంచ్ బీరెడ్డి జార్జిరెడ్డి తండ్రి మర్రిరెడ్డి జ్ఞాపకార్థ్ధం సొంత ఖర్చులు రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన బస్టాండ్‌ను ఆదివారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి మాట్లాడుతూ మరియాపురం గ్రామ అభివృద్ధితో పాటు సామాజిక కార్యక్రమాల్లో కీ.శే మర్రిరెడ్డి పాల్గొనేవారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలను అభివృద్ధి పథంలో సీఎం కేసీఆర్ నడిపిస్తున్నారని పేర్కొన్నారు. నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి, వాటికి కావాల్సిన నిధులు అందిస్తూ, మారుమూల గ్రామాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
పల్లె ప్రగతి పేరుతో ప్రతి గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, పల్లె నర్సరీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పేద వారి సంక్షేమానికి కల్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలు అందిస్తూ ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి నుంచి నిధులు వెంటనే అందిస్తున్నామని చెప్పారు. ఒకనాడు కరువుకాటకాలతో జనగామ నియోజకవర్గం ఉండేదని అలాంటి ప్రాంతాంన్ని కోనసీమలాగా గోదావరి జలాలు అందిస్తున్న గణత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బీరెడ్డి జార్జిరెడ్డి ఏకగ్రీవంగా మరియాపురం గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై తండ్రి పేరున స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం సర్పంచ్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జొన్నగోని హరిత సుదర్శన్ గౌడ్, జడ్పీటీసీ ఎం పద్మజావెంకట్రెడ్డి, ఏపీ సీడ్స్ మాజీ డైరెక్టర్ అర్జుల సంపత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పీ జగన్మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీ చెన్నూరి ప్రమీల, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అర్జుల మధుసూదన్‌రెడ్డి, తుపాకుల మంగ, పీఏసీఎస్ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, బెల్లం రాజు, నాయకులు టీ రాజేశ్వర్‌గౌడ్, చిలువేరు లింగం, వంగ భీమయ్య, భూక్యా రవి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- fighters
- freedom
- independence
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

